ఏపీకి రూ.341 కోట్ల కేంద్రసాయం..!

Andhra Pradesh Rs 341 Crore Central Financial
జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి(ఎన్డీఆర్ఎఫ్) నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.341.48 కోట్ల సాయం ప్రకటించింది. గతేడాది సంభవించిన వరదలు, ఆకస్మిక వర్షాలు, మొంథా తుపాను, కొండచరియలు విరిగిపడటం కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ లకు కలిపి మొత్తం రూ.1,912.99 కోట్ల సాయం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్షా అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. అందులో ఆంధ్రప్రదేశ్ కు రూ.341.48 కోట్లు (17.85%) కేటాయించింది.