ఉత్తర కొరియా ప్రయోగించిన మిసైల్ జపాన్ సముద్రంలో కి…!

ఉత్తర కొరియా ప్రయోగించిన మిసైల్ జపాన్ సముద్రంలో పడింది…

ఉత్తర కొరియా శనివారం (మార్చి 14) బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దక్షిణ కొరియా, జపాన్ దీనిని ధృవీకరించాయి. ఉత్తర – దక్షిణ కొరియాలు తూర్పు సముద్రం అని పిలిచే జపాన్ సముద్రం వైపు ఈ క్షిపణిని ప్రయోగించాయి. ఉత్తర కొరియా సముద్రం వైపు అనుమానిత బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా చెబుతోంది. ఇది పొరుగు దేశాలను షాక్‌కు గురిచేసింది. కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల యుద్ధనౌక నుండి క్రూయిజ్ క్షిపణి పరీక్షను పర్యవేక్షించిన కొద్ది రోజులకే ఈ ప్రయోగం జరిగింది…ఈ ఘటన జపాన్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి ఉండవచ్చని జపాన్ ప్రభుత్వం తెలిపింది. అది సముద్రంలో పడిందని కోస్ట్ గార్డ్ తెలిపింది. దక్షిణ కొరియాకు చెందిన యోన్‌హాప్ వార్తా సంస్థ శనివారం తన సైన్యాన్ని హెచ్చరిస్తూ.. ఉత్తర కొరియా తన తూర్పు తీరంలోని సముద్రం వైపు గుర్తు తెలియని క్షిపణిని ప్రయోగించిందని తెలిపింది. కాగా జపాన్ ప్రధాన మంత్రి కార్యాలయం ఈ సమాచారాన్ని విడుదల చేసింది. సోషల్ మీడియా Xలో ఒక పోస్ట్ ద్వారా వెల్లడించారు, “ఉత్తర కొరియా అనుమానిత బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. మరిన్ని వివరాలు త్వరలో అందుతాయి.” అని పేర్కొన్నారు…

ఉత్తర కొరియా బాలిస్టిక్ ప్రొజెక్టైల్స్‌ను ప్రయోగించినట్లు గుర్తించామని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్‌ఆప్ స్టాప్ వెల్లడించారు. ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణులు స్థానిక సమయం ప్రకారం.. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సముద్రంలో పడిపోయినట్లు జపాన్కోస్ట్ గార్డ్ పేర్కొంది. తాజా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలాఉంటే.. జనవరి 27న ఉత్తర కొరియా తూర్పు సముద్రం వైపు అనేక స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే..