మోకాలుకి, బోడి గుండుకి లింక్ పెట్టినట్లు.. మొయినబాద్లో ఒక మాజీ ఎమ్మెల్యే ఫార్మ్ హౌస్లో పార్టీ జరిగితే, దాన్ని కేటీఆర్ కు సంబంధం ఉంది..ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్…
మోకాలుకి, బోడి గుండుకి లింక్ పెట్టినట్లు..
మొయినబాద్లో ఒక మాజీ ఎమ్మెల్యే ఫార్మ్ హౌస్లో పార్టీ జరిగితే, దాన్ని కేటీఆర్ కు సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నారు..ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్..
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అర్థం పర్ధం లేకుండా మాట్లాడుతున్నాడు.. డ్రగ్స్ గురించి మాట్లాడితే లీగల్ నోటీసులు పంపుతా అని చెప్పిన తర్వాత కూడా మళ్లీ కేటీఆర్ కు లింక్ పెట్టడం దేనికి
రేవంత్ రెడ్డి లాగా ఏది పడితే అది మాట్లాడొద్దు
మీ మూసీ, మీ ఫ్యూచర్ సిటీ అవినీతి గురించి బైట పెట్టినందుకు కేటీఆర్ మీద దాడి చేస్తున్నారా…రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాత్రి పూట ఏ బిల్డింగులు, పబ్బులు, క్లబ్బులకు తిరుగుతున్నారని మేము కూడా అనొచ్చు కానీ రాజకీయాలను అంత దిగజార్చడం మాకు ఇష్టం లేదు
కేటీఆర్ గారు లేవనెత్తుతున్న ప్రభుత్వ వైఫల్యాల వల్ల, ఆయనకు మా పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కేటీఆర్ గారి పట్ల ఇలాంటి చిల్లర రాజకీయాలు, క్యారెక్టర్ అస్సాసినేషన్ చేస్తున్నారు..హైదరాబాద్ నగరంలోని చర్లపల్లిలో రూ.12 వేల డ్రగ్స్ మాఫియాను మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు
ఈ సంఘటన ఇక్కడ ఉన్న పోలీసులు, ప్రభుత్వం అసమర్ధతకు నిదర్శనం కాదా?
ఇంకా ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ గురించి మాట్లాడుతుంది..మహేష్ కుమార్ గౌడ్కు దమ్ముంటే అసెంబ్లీలో డ్రగ్ టెస్ట్ కౌంటర్లు ఏర్పాటు చేయించాలి
మొట్టమొదలు రేవంత్ రెడ్డి డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి, అనంతరం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులందరు డ్రగ్ టెస్ట్ చేయించుకుంటాము అన్నారు…