పరాభవ నామ సంవత్సర..2026-27..

శ్రీ పరాభవ నామ సంవత్సరం (2026-2027) మార్చి 19, 2026న ఉగాదితో ప్రారంభమై ఏప్రిల్ 6, 2027 వరకు కొనసాగుతుంది. ఇది 60 తెలుగు సంవత్సరాలలో 40వ సంవత్సరం. ఈ ఏడాది పరాభవం అంటే ఓటమి కాదు, అహంకారాన్ని జయించి.. జ్ఞానాన్ని పొందే కాలంగా పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరంలో ప్రజలకు ధర్మంపై ఆసక్తి కలుగుతుందని.. నూతన మార్పులు చోటు చేసుకుంటాయని.. అలాగే అజ్ఞానంపై జ్ఞానం విజయం సాధిస్తుందని పండితులు చెప్తున్నారు. తెలుగు సంవత్సరం పేరులో పరాభవం ఉన్నా.. ఈ ఏడాది మాత్రం గ్రహస్థితులు అద్బుతంగా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ప్రజలపై కూడా దేవుడి అనుగ్రహం అత్యంత అద్భుతంగా ఉంటుందని సూచిస్తున్నారు..

శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రత్యేకత: సాధారణంగా పరాభవం అంటే తెలుగులో ఓటమి అని అర్థం వస్తుంది. అయితే ఈ ఓటమి అనేది చెడుకు వస్తుందని మంచికి విజయం దక్కుతుందని పండితులు చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా ఇది అహాన్ని ఓడించి.. విజయాన్ని అందించే పవిత్ర సమయమని సూచిస్తున్నారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో మంచి పనులు చేయాలనే పట్టుదల ఉన్న వాళ్లకు విజయం చేకూరుతుందట. అలాగే బీదలకు పేదలకు సేవ చేయాలనే గుణం కలిగిన వారికి అందుకోసం అహర్నిశలు కృషి చేసే వారికి కూడా విజయాలు వరిస్తాయని చెప్తున్నారు..