తెలంగాణ భవన్‌లో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు..

తెలంగాణ భవన్‌లో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమం మరియు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మరియు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు..

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్( KCR ) పరాభవ నామ ఉగాది పండుగ( Ugadi Festival ) శుభాకాంక్షలు తెలిపారు. రైతు నామ సంవత్సరంగా ప‌రిగ‌ణించే ఈ ఉగాది రైతుల‌కు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాల‌ను చేకూర్చాలి అని ఆకాంక్షించారు. రాష్ట్రప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలు, సమస్యలు పరాభవం చెంది, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలన్నారు. మనిషిలోని చెడు లక్షణాలు పరాభవం చెంది మంచితనం విజయం సాధించాలన్నారు. రాష్ట్రం పునర్‌వైభవం సంతరించుకొని తెలంగాణ‌తో పాటు దేశం మ‌రింత అభివృద్ధి సాధించాలి అని కేసీఆర్ ఆకాంక్షించారు..