ధురంధర్-2’పై చెత్త సినిమా..కన్నడ నటి రమ్య ..

బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్’కు సీక్వెల్ సిద్ధమైంది. తాజాగా ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar 2) టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్‌తో ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘ధురంధర్’ మొదటి భాగం కేవలం హిందీలో మాత్రమే విడుదలై విజయం సాధించగా, సీక్వెల్ ‘ధురంధర్ 2’ను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు టీజర్ ద్వారా ప్రకటించారు.

టీజర్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులు, పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్‌ను పెంచేలా ఉన్నాయి.

ధురంధర్-2’పై చెత్త సినిమా..కన్నడ నటి రమ్య

‘ధురంధర్-2’పై ప్రశంసలు వెల్లువెత్తుతుంటే కన్నడ నటి రమ్య మాత్రం తీవ్ర విమర్శలు చేశారు. చెత్త సినిమా అని.. ఈ మూవీ చూసి డబ్బులు టైం వేస్ట్ చేసుకోవద్దంటూ ట్వీట్ చేశారు….తాజాగా కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి, మాజీ ఎంపీ రమ్య (దివ్య స్పందన) ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. దురంధర్ 2 సినిమాను ఆమె ఒక “ఎండ్యూరెన్స్ టెస్ట్” (ఓపికకు పరీక్ష) గా అభివర్ణించారు. ముగింపు లేని ఓ మొండి పాఠ్యపుస్తకాన్ని చదివినట్లుగా ఈ సినిమా సాగిందని.. విసుగు చెందిన ప్రేక్షకులు థియేటర్లలో చివరకు అసహనంతో నవ్వుకునే పరిస్థితి వచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు. ప్రేక్షకులు తమ విలువైన సమయాన్ని, డబ్బును వృధా చేసుకోకుండా ఈ సినిమాను థియేటర్లలో చూడటం మానేయాలని ఆమె గట్టిగా సూచించారు…
ముఖ్యంగా రణవీర్ సింగ్ నటనపై రమ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రణవీర్ సింగ్ ఈ సినిమాను తన భుజాలపై మోశారన్న వాదనను ఆమె పూర్తిగా కొట్టిపారేశారు. రణవీర్ పెర్ఫార్మెన్స్ కంటే ఆయన జుట్టుకే స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉందని.. దానికి బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డు ఇవ్వొచ్చని ఆమె ఎగతాళి చేశారు. మొదటి భాగంలో ఉన్న ఎనర్జీ, థ్రిల్, ప్రేక్షకుల్లో కనిపించిన ఉత్సాహం ఈ సీక్వెల్‌లో మచ్చుకైనా కనిపించలేదని.. థియేటర్లలో విజిళ్లు వేసే ఒక్క సన్నివేశం కూడా లేకపోవడం విచారకరమని ఆమె పేర్కొన్నారు.