పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament ) మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే..మార్చి 26వ తేదీ నుంచి పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ షురూ అవుతుంది. మార్చి 26వ తేదీన ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ మే మాసం మూడవ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలి అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో బంగ్లాదేశ్ ప్లేయర్లు ( Bangladeshi players) ఆడడం సందిగ్ధంగా మారింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజ్ముల్ అబెదిన్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం తమ బంగ్లా ఆటగాలను పాకిస్తాన్ దేశానికి పంపేది డౌటేనని తెలిపారు నజ్ముల్ అబెదిన్ ( BCB chairman Nazmul Abedin). పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్న నేపథ్యంలో బంగ్లాదేశ్ సర్కార్ ( Bangladesh Government) తుది నిర్ణయం తీసుకున్న తర్వాత తమ ప్లేయర్లను పంపే దానిపైన నిర్ణయం తీసుకుంటామని చివరి క్షణంలో ట్విస్ట్ ఇచ్చారు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB) ఆందోళనకు గురి అవుతోంది.
తాలిబన్ల హెచ్చరికలు.. PSL 2026 నుంచి బంగ్లా ప్లేయర్లు ఔట్
ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ ఆసుపత్రి పైన పాకిస్తాన్ వైమానిక దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో 400 మంది మరణించారు. దీంతో పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకునేందుకు తాలిబన్స్ సిద్ధమవుతున్నారు. రంజాన్ పూర్తయిన తర్వాత ఈ క్షణమైనా అటాక్ చేసే ఛాన్స్ ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ జరిగే స్టేడియాల పైన బాంబులు వేస్తామని ఇప్పటికే తాలిబన్స్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజ్ముల్ అబెదిన్ ( BCB chairman Nazmul Abedin) కీలక ప్రకటన చేశారు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ కోసం బంగ్లాదేశ్ ప్లేయర్లను పంపడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ప్రస్తుతం పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య యుద్ధం నెలకొందని వివరించారు. ఇలాంటి నేపథ్యంలో తమ బంగ్లాదేశ్ ప్లేయర్లను పాకిస్తాన్ దేశానికి పంపిస్తే ఏ క్షణమైనా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుందని నజ్ముల్ షాకింగ్ ప్రకటన చేశారు. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వంతో త్వరలోనే చర్చలు జరుపుతామని వివరించారు. బంగ్లాదేశ్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే తమ ప్లేయర్లను పాకిస్తాన్ పంపిస్తామని క్లారిటీ ఇచ్చారు నజ్ముల్ అబెదిన్. దీంతో PSL 2026 టోర్నమెంటులో బంగ్లాదేశ్ ప్లేయర్లు పాల్గొనేది కాస్త డౌట్ గా