తగ్గేదే లే.. యుద్ధం కొనసాగుతుంది: నెతన్యాహు.
యుద్ధం ముగిసింది అని ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకునేలోపే.. మళ్లీ బాంబుల మోత. పవిత్రక్షేత్రమైన జెరూసలేం దాడులతో దద్దరిల్లింది. ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న మనకు ఇదో చేదు వార్త. యుద్ధం ఆగితే.. మనకు గ్యాస్, చమురు కొరత ఉండదు. కానీ ఇరాన్ తీరుతో.. యుద్ధం ఆగేలా లేదు. కానీ యుద్ధాన్ని మొదలుపెట్టింది ఇజ్రాయెల్, అమెరికా. దాంతో.. ఎందుకు మొదలుపెట్టాలి? అని ప్రశ్నిస్తున్నట్లు.. ఇరాన్ వెనక్కి తగ్గట్లేదు. ట్రంప్ యుద్ధానికి 5 రోజులు విరామం ఇస్తున్నట్లు పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే.. టెల్అవీవ్, జెరూసలేంపై మిస్సైళ్లతో విరుచుకుపడింది ఇరాన్
పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు జరుగుతున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్‌పై దాడులకు US అధ్యక్షుడు ట్రంప్ బ్రేక్ ఇచ్చినా తాము మాత్రం ఆగేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్, లెబనాన్‌పై దాడులు కొనసాగుతాయన్నారు. కాగా దాడుల్లో సాధించిన విజయాలే డీల్‌లో పైచేయి సాధించడానికి కీలకం అవుతాయని భావిస్తున్నట్లు ట్రంప్ తనతో చెప్పారని తెలిపారు..
యుద్ధం ఆగలేదని అర్థమైపోతోంది. మళ్లీ మనకు టెన్షన్స్ కంటిన్యూ అని స్పష్టమవుతోంది. గత 20 ఏళ్లుగా అమెరికా ఆంక్షల వల్ల నష్టపోతున్న తాను.. కొత్తగా నష్టపోయేది ఏమీ లేదు అని భావిస్తున్న ఇరాన్.. తమ దాడులతో ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికా నష్టపోయేలా చేస్తోంది. ఈ వార్తను మనం తట్టుకోలేం. గత 24 రోజులుగా మనం పడుతున్న ఇబ్బందులు మనకే తెలుసు. ముఖ్యంగా పేదల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితులు ఇంకా ఎంతకాలం కొనసాగుతాయనేది కొత్తగా..
బ్లూమ్‌బెర్గ్ నివేదించిన ప్రకారం:
ఇరాన్ దాడులు తమ విద్యుత్ లేదా నీటి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే, ఇరాన్‌పై దాడి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సౌదీ అరేబియా అమెరికాకు తెలియజేసింది.