దేశంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాల పెంపుకు కేంద్రం ప్రణాళిక
ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం
543గా ఉన్న లోక్సభ స్థానాలను 816కు, 4,123గా ఉన్న అసెంబ్లీ స్థానాలను 6,185కు పెంచాలని నిర్ణయం
తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల నుండి 179కి, లోక్సభ స్థానాలను 26కు పెంచే అవకాశం
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలను 263కి, 25 లోక్సభ స్థానాలను 38కి పెంచే అవకాశం
2027 మార్చి వరకు జనాభా లెక్కలు పూర్తి చేసి, ఆ నివేదిక ఆధారంగా పునర్విభజన చేసేందుకు ప్రణాళిక
జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేసేందుకు దక్షిణాది రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలిపిన నేపధ్యంలో, ప్రతీ రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..
సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఎన్డీయే సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్డీయే పార్టీలు హాజరయ్యాయి. కేంద్రమంత్రులు అమిత్షా, కిరణ్ రిజిజు, అర్జున్రామ్ మేఘ్వాల్ల నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఈ క్రమంలో అసెంబ్లీ, లోక్సభ సీట్లు పెంపు విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. లోక్సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్రం డిసైడ్ అయ్యింది.
అంతేకాదు ఈ బిల్లు రానున్న పార్లమెంటు సమావేశాల్లో పెట్టడానికి తెరవెనుక పావులు కదుపుతోంది ఎన్డీయే సర్కార్. ఆ లెక్కన పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816కి చేరుతాయని తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న 4,123 ఉన్న అసెంబ్లీ స్థానాలు ఇకపై 6,185 సీట్లు కానున్నాయి. ఏపీ పునర్విభన చట్టంలో నియోజకవర్గాల పెంపును ప్రధానంగా ప్రస్తావించింది కేంద్రం.
ఈ లెక్కన తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కు చేరుతాయి. ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా, అవి 263 స్థానాలకు చేరనున్నాయి. ఆ లెక్కన ఇరు రాష్ట్రాల్లో 50 శాతంపైగానే సీట్లు పెరిగాయి. అంతేకాదు లోక్సభ స్థానాలు ఏపీలో 25 నుంచి 38 పెరగనున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 17 ఎంపీలు 26 కి చేరనున్నాయి. ఆ లెక్కల ప్రకారం ఏపీలో 13, తెలంగాణలో 9 ఎంపీ సీట్లు పెరగనున్నాయి.
2011, 2027 జనాభా లెక్కన ఆధారంగా తీసుకుంటారా అనేదానిపై చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా జనగణన వచ్చే ఏడాది మార్చి ఒకటి నాటికి పూర్తి చేయనుంది. వాటి లెక్కలను ప్రకటించిన తర్వాత వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపటవచ్చని కొందరు అధికారులు చెబుతున్నారు. దీనిపై అన్ని పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఎన్డీయే నిమగ్నమైంది…