యుద్ధం పేరుతో రేట్లు పెంచి వ్యాపారస్తుల దందా…
అక్కడ రెండు దేశాల మధ్య యుద్ధం.. ఇక్కడ సామాన్యుడిపై యుద్ధం..
ఆయిల్ ప్యాకెట్..150.. నుండి..160.
గ్యాస్.. బ్లాక్ లో..2500 నుండి..2800 వరకు...
హుజూర్ నగర వ్యాపారస్తుల నయా దందా..
నిత్యవసర సరుకుల ధరలు ఎంఆర్పి రేటుకు మించి అధిక రేటులకు అమ్మకం..
సిండికేట్ తో నయా దందా.. గట్టిగా అడిగితే సరుకులు లేవు..!.
ధరల నియంత్రణలో అధికారుల వైఫల్యం..!?
వాస్తవానికి దేశంలో ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్రేట్లు, రవాణా చార్జీలు పెరగలేదు. గ్యాస్రేట్ల పెంపు కూడా నామమాత్రంగానే ఉంది. కానీ డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదంటున్న వ్యాపారవర్గాలు జనం జేబులకు చిల్లు పెడ్తున్నాయి. నిత్యావసర సరుకుల నుంచి వంట గ్యాస్ వరకు స్టాక్‌ను బ్లాక్చేస్తూ రేట్లు పెంచేసి అందినకాడికి దండుకుంటున్నాయి…
గ్యాస్దొరకడం లేదని, కమర్షియల్సిలిండర్లకు ఎక్కువ రేటు చెల్లించాల్సి వస్తోందని, వంట నూనెల దిగుమతి సుంకం పెరిగిందని.. ఇలా రకరకాల సాకులతో హోటల్ నిర్వాహకులు ఫుడ్ ఐటమ్స్ రేట్లను అడ్డగోలుగా పెంచేశారు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ముడిసరుకుల వ్యయం కేవలం ఐదు శాతం పెరిగితే..
హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు మాత్రం రాత్రికి రాత్రే 25 నుంచి 30 శాతం మేర రేట్లు పెంచాయి. రేటు మార్చుతూ పాత మెనూ కార్డులపై కొత్త స్టిక్కర్లు అంటించారు. ఇరానీ చాయ్ దగ్గరి నుంచి బిర్యానీ దాకా అన్నింటి ధరలూ పెంచేశారు.
ఒక్కో ఇరానీ చాయ్‌పై రూ.5 నుంచి రూ.10 దాకా పెంచడం గమనార్హం. ఇక సామాన్యుడి బ్రేక్ ఫాస్ట్ అయిన ఇడ్లీ, దోశ, వడ ధరలు ప్లేట్‌పై కనీసం రూ.10 నుంచి రూ.20 మేర పెంచారు. మొన్నటి వరకు రూ.120 నుంచి రూ.150కి దొరికే సింగిల్ బిర్యానీ ఇప్పుడు ఏకంగా రూ.40 నుంచి రూ.50 వరకు పెరిగి రూ.200కు చేరింది. దీనికి తోడు ప్యాకింగ్ చార్జీలు, డెలివరీ ఫీజుల పేరుతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్‌లో (స్విగ్గీ, జొమాటో వంటివి) అదనంగా మరో 20 నుంచి 30 శాతం వరకు బాదుతున్నారు.
ఇరాన్ యుద్ధం ప్రారంభమై దాదాపు మూడో వారం చివరికి చేరుకున్న వేళ చమురు సెగలు సామాన్యుడి జేబును తాకాయి. మెున్న గ్యాస్ ఇప్పుడేమే పెట్రోల్ రేట్లు పెరిగాయి. దేశవ్యాప్తంగా బంకుల్లో అమ్మే ప్రీమియం పెట్రోల్ అదే పవర్ పెట్రోల్ పై తాజాగా రేటు పెంచాయి ఆయిల్ కంపెనీలు. యుద్ధం వేళ ఏర్పడిన ప్రతిష్టంభనతో షిప్స్ నట్టనడి సముద్రం మధ్యలోనే ఆగిపోవటంతో పరిస్థితులు దిగజారుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు ఆయిల్ కంపెనీలు దేశవ్యాప్తంగా అమ్ముతున్న పవర్ పెట్రోల్ రేటును లీటరుకు 2 రూపాయల 26 పైసలు పెంచేసాయి. ఆయిల్ కంపెనీని బట్టి రేటు రూ.2.26 నుంచి రూ.2.35 వరకూ పెరిగాయి…
అనధికారికంగా నిత్యవసర సరుకుల ధరల పెంపు..!
ఆయిల్ ప్యాకెట్..150.. నుండి..160.
గ్యాస్.. బ్లాక్ లో..2500 నుండి..2800 వరకు..
నిత్యావసరాల ధరల పెంపు ఒక ఎత్తయితే, బహుళజాతి సంస్థలు, ఎఫ్ఎంసీజీ (నిత్యావసర వస్తు ఉత్పత్తి) కంపెనీలు అనుసరిస్తున్న వ్యూహాలు వినియోగదారులను ఏమారుస్తున్నాయి. ఒకేసారి ధరలు పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో కార్పొరేట్ కంపెనీలు ‘శ్రింక్‌ఫ్లేషన్’ అనే మోసానికి తెరలేపాయి.
వస్తువు ధరను అలాగే ఉంచి, ప్యాకెట్లలోని పరిమాణాన్ని (క్వాంటిటీని) తగ్గించేయడమే శ్రింక్‌ఫ్లేషన్. ఇప్పటికే వివిధ కంపెనీలు వారం వ్యవధిలోనే ప్రొడక్షన్లో మార్పులు తీసుకువచ్చాయి. ఉదాహరణకు నిన్నటిదాకా వంద రూపాయలకే దొరికిన సబ్బు లేదా వాషింగ్ పౌడర్ ప్యాకెట్ ధర నేడు కూడా వంద రూపాయలే ఉన్నా, దాని బరువు మాత్రం 10 నుంచి 20 శాతం వరకు తగ్గిపోతుంది…
బ్లాక్ లో గ్యాస్ దందా..!
బుక్ చేసిన వారికి బండలు మాత్రం ఆలస్యం అవుతున్నాయి కానీ బ్లాక్ మార్కెట్లో మాత్రం అడ్డగోలుగా స్టాక్ ఉంటూనే ఉన్నాయి… ఒక్కొక్క గ్యాస్ బండ సుమారు 2500 నుండి 2800 వందల వరకు బ్లాక్‌లో అమ్ముతూ చిరు వ్యాపారులను,, మధ్యతరగతి వారిని దండుకుంటున్న బ్లాక్ మార్కెటింగ్ కేటుగాళ్లు…
వరి కొంతమంది గ్యాస్ ధరలు పెరిగాయి అంటూ క్వాంటిటీ తగ్గిస్తూ ప్రజల జాబులుకు చిల్లులు పెడుతున్నారు…… ప్రస్తుతానికి అధికారులు వీటిపై పర్యవేక్షణ కరువైందంటూ చిరు వ్యాపారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… ఇలానే కొనసాగితే యుద్ధం పేరుతో సామాన్యుడిపై మరో యుద్ధాన్ని మొదలుపెట్టే అవకాశం ఉందంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అక్రమార్కులపై చర్యలు తీసుకొని బ్లాక్ దందా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు..