సిద్దిపేటలో ఎవరో ఎందుకు.. రేవంత్ పోటీ చేయాలి..నేనే స్వయంగా ఆహ్వానిస్తున్నా..-హరీష్‌రావు..

సిద్దిపేటలో ఎవరో ఎందుకు.. రేవంత్ పోటీ చేయాలి..నేనే స్వయంగా ఆహ్వానిస్తున్నా-హరీష్‌రావు..

సీఎం రేవంత్‌కు హరీష్‌రావు కౌంటర్‌
తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ మళ్లీ సీఎం కాలేరు…మళ్లీ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నారు..
సిద్దిపేటలో ఎవరో ఎందుకు..
రేవంత్ పోటీ చేయాలి..నేనే స్వయంగా ఆహ్వానిస్తున్నా-హరీష్‌రావు…

ఎన్నికల సందర్భంగా ఓట్లు దండుకోవడం కోసం అలవిమాలిన హామీలు ఇచ్చి ఇప్పుడు మాట తప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Govt) పై బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు (BRS Leader), మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao) మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సర్కారుపై నిప్పులు చెరిగారు. ఆశావర్కర్లకు రూ.18 వేల వేతనం ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ నాడు తన ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్నదని ఆయన గుర్తుచేశారు…అయితే కాంగ్రెస్‌ తన మానిఫెస్టోలో పేర్కొన్న మేరకు ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం ఎప్పటి నుంచి ఇస్తుందని ప్రశ్నించారు. గత వారం రోజులుగా ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం వారికి రూ.18 వేల కనీస వేతనం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్‌ను కూడా బంద్ చేశారని విమర్శించారు. దాంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీలు 20% తగ్గాయని చెప్పారు. దీనిపై ప్రభుత్వ చర్యలు ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ కిట్‌ను ఎప్పటి నుంచి తిరిగి ప్రారంభిస్తారో చెప్పాలని నిలదీశారు..

జీవితంలో మళ్ళీ సీఎంగా రేవంత్ రెడ్డి అయ్యే ఛాన్స్ లేదని అన్నారు.. ఇంకా ఆ భ్రమలో ఉంటే ఎవ్వరు చేసేది ఏమి లేదు…. సిద్ధిపేట లో పోటీపై మాట్లాడుతున్నారు… వాళ్ళు వీళ్ళు ఎందుకు.. స్వయంగా మీరే రండి… పోటీ చేద్దాం అంటూ సవాల్ విసిరేరు…