DNR ఫౌండేషన్ ఖమ్మం , డిస్ట్రిక్ట్ NRI ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు..

పాదచారులకు NRI ఫౌండేషన్ త్రాగునీటి కనుక

లకారం ట్యాంక్ బండ్ కు ప్రతిరోజూ “నడక” కోసం అలాగే సందర్శకులుగా వేల సంఖ్యలో ట్యాంక్ బండ్ వస్తూ ఉంటారు. వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిస్ట్రిక్ట్ ఎన్నారై ఫౌండేషన్ ద్వారా చల్లని త్రాగునీటి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అందుకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ షెడ్ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేసింది. ఈరోజు లకారం ట్యాంక్ బండ్ వద్ద వాటర్ ప్లాంట్ ను ప్రారంభోత్సవం చేశారు. కొంతకాలం క్రితం వాటర్ ప్లాంట్ అవసరాలు ప్రముఖుల ద్వారా జయ శేఖర్ తాళ్లూరి దృష్టికి తేవడం జరిగింది. స్పందించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవసరం ఎలాంటిదైనా పదిమందికి ఉపయోగ పడే కార్యక్రమంలో చేయూత నివ్వడానికి ఎప్పుడూ సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటూ మరింత మందికి సాయం చేసేందుకు స్ఫూర్తిగా ఉండాలని కోరారు.
డిస్ట్రిక్ట్ NRI ఫౌండేషన్ బాధ్యులు బయ్యన బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునకొల్లు నీరజ, జయశేఖర్ తాళ్లూరి , DNF బండి నాగేశ్వర్ రావు, డిప్యూటీ మేయర్ ఫాతిమా బేగం, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, అన్నం ఫౌండేషన్ అన్నాం శ్రీనివాసరావు, తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్ట్ బాధ్యులు వల్లూరిపల్లి వంశీకృష్ణ, కమ్మ సంఘం లక్ష్మణ్ రావు దండ్యాల, వాకర్స్ చంద్రయ్య చావా లక్ష్మీనారాయణ, పీస్ యోగా విద్యాలయం షేక్ బహార్ అలీ, రోటరీ క్లబ్ పసుమర్తి రంగారావు, ఇంకా అనేకమంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక నిరుపేద విద్యార్థిని సమ్మక్క కి NRI లెనిన్ చౌదరి ఆర్ధిక సహాయంతో (50వేల) లాప్ టాప్ ను అందించారు, NRI శివ మాటేటి, శివ నాయుడు ఆర్థిక సహాయంతో,8 మంది ప్రభుత్వ పాఠశాలకు నడిచి వెళ్ళే విద్యార్థులకు సైకిల్ను అందజేశారు.