స్టంప్స్ ఎగిరిపోయాయి బౌలింగ్ వేసిన సచిన్ టెండూల్కర్ తనయుడు.!

టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు. ఐపీఎల్‌-2026 సీజన్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ నుంచి రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కు అర్జున్‌ను లక్నో కొనుగోలు చేసింది..అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో అయితే అర్జున్‌కు లక్నో తుది జట్టులో దక్కలేదు.

లక్నో తమ రెండో మ్యాచ్‌లో ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో లక్నో షేర్ చేసింది. ఈ వీడియోలో 26 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ తన యార్కర్లతో స్టంప్స్‌ను పడగొడుతూ కనిపించాడు.

అతడు లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కావడంతో బంతిని లోపలికి స్వింగ్ చేస్తూ లెగ్-స్టంప్, ఆఫ్-స్టంప్స్‌ను పడగొట్టిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అర్జున్‌కు తర్వాతి మ్యాచ్‌లో ఆడే అవకాశమివ్వాలని కామెంట్లు పెడుతున్నారు. అయితే మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్‌, మోహ్షిన్ ఖాన్, నోర్జే వంటి స్టార్ పేసర్లు ఉండడంతో లక్నో ప్లేయింగ్ ఎలెవన్‌లో అర్జున్‌కు చోటు దక్కడం కష్టంగా మారింది..