గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తొలగించారు..కాంగ్రెస్ పార్టీ గుండాలకు తెలివి లేకుండా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే ఎమ్మెల్యే ఇల్లు లాంటిదని ఆ ఇంగిత జ్ఞానం లేకుండా రేవంత్ రెడ్డి ఫోటో ఏ ఆఫీసులలో పెట్టాలో కాంగ్రెస్ పార్టీ గూండాలకు తెలియకుండా మతిస్థిమితం కోల్పోయి దాడులకు పాల్పడి ఫోటోలు పెడుతున్నారని అభివర్ణించారు.
అవగాహన లేకపోతే ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ గూండాలు చికిత్స చేయించుకుని జ్ఞానం నేర్చుకోవాలని హితపు పలికారు. భారతదేశంలోని చట్టాలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని ఏ గవర్నమెంట్ ఆర్డర్ జీవో రూల్స్ లో ఉండదన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రభుత్వ ఆఫీసు కాదని అది ఎమ్మెల్యే వ్యక్తిగత రాజకీయ కార్యాలయం అని స్పష్టం చేశారు. అక్కడ ఆయన వ్యక్తిగత ఫోటోలు బ్యానర్లు సైతం పెట్టుకోవచ్చని అన్నారు. ప్రభుత్వ ఆఫీసులు సెక్రటేరియట్ జిల్లా ఆఫీసులు మొదలైన వాటిలో మాత్రమే రాష్ట్రపతి, ప్రధాని, సీఎం వంటి అధికారిక ప్రోటోకాల్ ఫోటోలు ఉంటాయి కానీ అవి కూడా చాలా సందర్భాల్లో ఐచ్చికమన్నారు. తెలంగాణలో కూడా ఇలాంటి ఏ నియమం లేదని అన్నారు..