మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదం..

శుభకార్యం ఉండగా.. దేవుడు వద్ద మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తోన్న వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వల్లభాపురం శివారులో గల ఏచర్ల ముత్యాలమ్మ గుడి దగ్గర, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన జనిగ నరసింహారావుకు సంబంధించిన కుటుంబ సభ్యులు చిన్న పిల్లలు, పెద్దలు మొత్తం సుమారు 20 మంది TS29T 7150 నెంబర్ గల బొలెరో వాహనంలో దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు లింగమంతుల స్వామి వద్ద మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్లే సందర్భంలో, దానికంటే ముందుగా వచ్చే వల్లబాపురం రెవెన్యూ పరిధిలోని ఏచర్ల ముత్యాలమ్మ తల్లి గుడి వద్ద కొబ్బరికాయ కొట్టారు. కోడిని కోసుకొని మొక్కులు చెల్లించిన అనంతరం మళ్లీ దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి (పెద్దగట్టు)కు వెళ్తున్న క్రమంలో ఈ రోజు తెల్లవారుజామున సుమారుగా 02:00 గంటల సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న MP13 GB5716 నెంబర్ గల ఐచర్ డీసీఎం వెహికల్ ఆజాగ్రత్తగా అతివేగంగా వచ్చి బొలెరో వాహనాన్ని వెనక నుండి బలంగా ఢీకొట్టింది. అందులో ఉన్న 20 మందిలో సుమారు 10 మందికి స్వల్ప గాయాలు కాగా, జనిగ సతీష్ ( 25), జనిగ నరసింహారావు (37) ఇద్దరు చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం. మిగిలిన గాయపడిన వారు సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని సమాచారం..