వ్యక్తే అనుకుంటే.. పార్టీని కూడా సైకోలా తయారు చేశారు. -సీఎం చంద్రబాబు.

వ్యక్తే అనుకుంటే.. పార్టీని కూడా సైకోలా తయారు చేశారు. -సీఎం చంద్రబాబు

ఏపీ రాజధానిగా అమరావతి అని కేంద్రం చట్టం చేసింది. అమరావతికి 49 రాజకీయ పార్టీలు సపోర్ట్‌ చేశాయి. మొన్న మూడు ముక్కల ఆట.. ఇప్పుడు మావిగన్‌ అంటున్నారు. మావిగన్‌ అన్నాడు, వాటికన్‌ అనలేదు సంతోషం. వ్యక్తే అనుకుంటే.. పార్టీని కూడా సైకోలా తయారు చేశారు. -సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ నేడు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. ఈ భేటీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధంగా ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి క్యాబినెట్ కృతజ్ఞతలు తెలపనుంది…వ్యాలీ ప్రాజెక్ట్ కింద మూడు ప్రముఖ సంస్థల స్థాపనకు కూడా క్యాబినెట్ అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే విద్యా రంగానికి సంబంధించి ఫీజు రెగ్యులేటరీ కమిటీ (FRC) ఏర్పాటు కోసం ఆర్డినెన్స్‌కు కూడా ఆమోదం తెలపనున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంపై చ‌ర్చించ‌నున్న క్యాబినెట్.. ప‌లు సంస్థ‌ల‌కు భూ కేటాయింపుల‌కు అమోదం తెల‌ప‌నుంది. అదే విధంగా, రాష్ట్రంలో 28 జిల్లాల ఆధారంగా జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశంపై కూడా చర్చ జరగనుంది. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు, మల్టీ జోనల్ వ్యవస్థ అమలు చేసే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది..