మోదీ సర్కార్ కొత్త స్కీమ్ కీలక ప్రకటన..

కేంద్ర ప్రభుత్వం అదిరే శుభవార్త అందించింది. మోదీ సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది. కొత్త స్కీమ్ (Scheme) తీసుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ (Modi) తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో కొత్త స్కీమ్‌ తీసుకువస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల చాలా మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ కేంద్రం ఏ స్కీమ్ తీసుకువస్తోంది? ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? అనే అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం…పట్టణ ప్రాంతాల్లో సొంత ఇల్లు కలిగి ఉండాలని భావించే వారి కోసం కేంద్రం కొత్త స్కీమ్ తీసుకురాబోతోంది. బ్యాంక్ లోన్స్‌ వడ్డీకి సంబంధించి ఊరట కలిగించేలా ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకురాబోతోంది. 77వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే ఇల్లు లేని మధ్యతరగతి ప్రజల కోసం కొత్త స్కీమ్ తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవలనే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) స్కీమ్ పొడిగిస్తున్నట్లు ప్రకటిచింది. ఈ స్కీమ్ వచ్చే ఏడాది డిసెంబర్ వరకు అంటే 2024 చివరి వరకు అందు బాటులో ఉంటుందని వెల్లడించింది. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని చెపుకోవచ్చు. మరీ ముఖ్యంగా సొంత ఇల్లు కలిగి ఉండాలని భావించే వారికి బెనిఫిట్ చేకూరనుంది.

సాధారణంగా అయితే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) స్కీమ్ 2022 మార్చి 31తో ముగియాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఈ గడువు పొడిగిస్తూ వచ్చింది. గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌషల్ కిషోర్ ఇటీవలనే లోక్ సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2015 నుంచి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ స్కీమ్ అమలు చేస్తూ వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం కింద అర్హత కలిగిన వారికి కనీస వసతులతో ఇళ్లను నిర్మించి ఇస్తున్నట్లు వివరించారు.