HYD: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల.. ఫలితాలు విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కేకే.. జనరల్, ఒకేషనల్ కలిపి 70.58 శాతం ఉత్తీర్ణత..
మే 13 నుంచి తెలంగాణ ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లమెంటరీ పరీక్షలు..
రేపటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు..
మొబైల్ నుంచి కూడా దరఖాస్తుకు ఛాన్స్..
ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫలితాల్లో ఫస్టియర్లో 66.20 శాతం, సెకండియర్లో 70.58 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 82.73 శాతంతో టాప్గా నిలిచింది. 58.69 శాతంతో రాజన్న సిరిసిల్ల జిల్లా చివరలో ఉంది…ఇక బాలికలు 74.4 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 57.69 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ పరీక్షలకు మొత్తం 9.5 లక్షల మంది హాజరవ్వగా.. ఫస్టియర్లో 3,23,807 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో 3,58,490 మంది ఉత్తీర్ణత సాధించారు.
తొలుత మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేస్తామని తెలిపిన అధికారులు, ఆ తర్వాత 11గంటలకే ముహూర్తాన్ని ఖరారు చేశారు. వాస్తవానికి ముఖ్యమంత్రి చేతులు మీదుగా రిలీజ్ చేయించాలని విద్యాశాఖ అధికారులు భావించినప్పటికీ సమయాభావం వల్ల వీలుకాలేదని తెలిసింది..