లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో రేవంత్ భేటీ..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్సీ నామినేషన్ల ఫైల్‌పై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ భేటీ అత్యంత కీలకంగా మారింది. తెలంగాణ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ పదవికి సంబంధించి సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు నెలల లోపు ఏదో ఒక సభ (అసెంబ్లీ లేదా కౌన్సిల్)లో సభ్యుడిగా ఎన్నిక కావాలి. అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఈ నెల 30వ తేదీకి సరిగ్గా ఆరు నెలలు పూర్తి కానున్నాయి. అంటే.. మరో పది రోజుల్లోపు ఆయన చట్టసభ సభ్యుడిగా ఎన్నిక కాకపోతే మంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది…