ప్రభుత్వ పెద్దలు పాలన వదిలేసి కేసీఆర్ చావాలి అని కోరుకుంటున్నారు. వెయ్యి జన్మలెత్తినా నేను చావను నా కొడకా.. కేసీఆర్..

నూటినూరు శాతం మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండే, దుఖం వచ్చేది ఎమ్మెల్యేలుగా ఉన్ను ఏంచేయలేని పరిస్థితి ఆగమాగం. ఎట్లుండె తెలంగాణ. తెలంగాణ రాకముందు ఎంత భయంకరమైన బాధలుండే.. అసెంబ్లీలో వరంగల్‌ ఎమ్మెల్యే ఉండే ఏదో విషయంలో ఆయన మాట్లాడపోతే .. ఏ అసెంబ్లీలో తెలంగాణ అని మాట్లాడొద్దు.. అనొద్దు.. నిషేధం. అంత భయంకరమైన వివక్ష. మన భాష, మన బతుకు మీద, మన నీళ్ల మీద దాడి, మన ఉద్యోగాల మీద మన వనరుల మీద, మన ఆస్తుల మీదమొత్తం దోపిడీ చేయడం తప్ప ఇక్కడి ప్రజలను బికారీల్లాగా వదిలిపెట్టారు. రైతాంగం ఆగమాగమైపోయి చెట్టుకొకలు పుట్టుకొకరు అయిపోయారు. ఎస్సారెస్పీ కాలువ ఉన్నట్వంటి జగిత్యాల, మెట్‌పల్లి,చొప్పదండి ప్రాంతాల నుంచి కూడా దుబాయికి, బొంబాయికి వలసలు, పాలమూరు జిల్లా అయితే భయంకరమైన వలసలు. కొన్ని పార్టీలు చేసే పని చూస్తే బాధకలిగేది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో నూటికి 90 మంది యువకులు వలస. బతుకాలంటే బతుకపోవాలే. అక్కడ బతుకు లేదు. ఉన్న ముసలోళ్లకు వాళ్లు డబ్బులు పంపిస్తే కంట్రోల్‌ బియ్యం కొనుక్కొని తిని బతకాలి. అండ్ల కొంతమందికి అందకపోతే కొన్ని పార్టీల వాళ్లు తామేదో గొప్పతనం చేసినట్టు గంజి కేంద్రాలు పెట్టేవాళ్లు. అంత అద్వాన్న స్థితికి తెలంగాణను దిగజార్చారు..

తెలంగాణ గడ్డపై గంజి కేంద్రాలు నడిచిన రోజులు చూశాం.. కరెంట్ కోసం బషీర్‌బాగ్‌లో మన పిల్లలు ప్రాణాలిస్తుంటే చలించి ఉద్యమానికి వచ్చాను.. నన్ను బాడీ షేమింగ్ చేసినా, హేళన చేసినా పక్షిలా రాష్ట్రమంతా తిరిగి తెలంగాణ సాధించాను” అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావోద్వేగ ప్రసంగం చేశారు. సోమవారం జగిత్యాలలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాకముందున్న దుస్థితిని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. పాలమూరు నుంచి 90 శాతం వలసలు ఉండేవని, తిండి లేక, పని లేక ప్రజలు దేశాలు దాటి వెళ్లేవారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో కరెంట్ ఛార్జీలు పెంచితే నిరసన తెలిపిన వారిని కాల్చి చంపిన ఘటన తనను ఉద్యమం వైపు నడిపించిందని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ మంచినీళ్లు, 24 గంటల కరెంట్ ఇచ్చి తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టామని గర్వంగా ప్రకటించారు..ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తులం బంగారం, స్కూటీలు, పెంచిన పెన్షన్లు, జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతుబంధు, దళితబంధులను గాలికి వదిలేసి రైతులను, పేదలను ఏడిపిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు పాలన వదిలేసి కేసీఆర్ చావాలి అని కోరుకుంటున్నారు. వెయ్యి జన్మలెత్తినా నేను చావను నా కొడకా.. అంటూ అత్యంత ఘాటుగా స్పందించారు. అభివృద్ధి ముచ్చట లేదని, కేవలం పాలకుల చిల్లర మాటలు తప్ప రాష్ట్రంలో ఏమీ జరగడం లేదని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. “మొన్న కేవలం 1.7 శాతం ఓట్లతోనే ఓడిపోయాం. ప్రజలు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ నైజాన్ని గ్రహిస్తున్నారు. మళ్లీ బరాబర్ మనమే అధికారంలోకి వస్తాం.. ఈసారి బంపర్ మెజార్టీతో వస్తాం” అని కేడర్‌లో ఉత్సాహం నింపారు.

అది కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వం కావొచ్చు. మంచినీళ్లు ఇయ్యలె. కరెంట్ ఇయ్యలె. మనదగ్గర నిలదీసే నాయకులు లేరు. అందరూ కట్టుబానిసలైపోయారు. ఆ పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటికాయ ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా కరెంట్ చార్జీలు పెంచిండు. తెల్లారే నేనొక ఉత్తరం రాసిన. నీ కరెంట్ చార్జీల పెంపుదల వాపసు తీసుకో. లేకపోతే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు న్యాయం జరుగదని నేను తెలంగాణ ఉద్యమానికి పోవాల్సి వస్తదని చెప్పిన. ఆయన తీసుకోలేదు. కొంతమంది రైతులు పోరాటానికి హైదరాబాద్‌కు వస్తే పట్టపగలు 11:30 గంటలకు విచ్చలవిడిగా కాల్చి చంపేస్తే ముగ్గురు రైతులు అక్కడికక్కడే చనిపోయారు. ఇక లాభం లేదు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నం. ఎదురుతిరిగితే వీళ్లు కాల్చి చంపారు. జెండా ఎత్తడం తప్ప మార్గం లేదని చెప్పి ఆనాడు తెలంగాణ ఉద్యమానిక శ్రీకారం చుట్టినం. వెంబడి ఎవరు వచ్చినా రాకున్న ఆసరే ప్రజలున్నరు..ఈ సభలో సీనియర్ నేత టీ. జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు.