అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జాతీయ రహదారిపై విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తుని నుంచి విశాఖపట్నం వెళ్తున్న లారీ నియంత్రణ కోల్పోయి, రోడ్డుపై పనుల నిమిత్తం వెళ్తున్న ముగ్గురు మహిళా ఉపాధి కూలీలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్కు తరలిస్తుండగా, మార్గమధ్యలోనే ఒక మహిళ కన్నుమూసింది. మిగిలిన ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.