ప్రాణహిత – చేవేళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించే కార్యాచరణ వేగవంతం చేయాలి.. మంత్రి ఉత్తమ్.
ప్రాణహిత – చేవేళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మించే కార్యాచరణ వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి.. minister Uttam Kumar Reddy.
ఈ రోజు ఎంసీహెచ్ఆర్డీలో ఈ ప్రాజెక్టు పై సమీక్ష నిర్వహించాను. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ మీద ఇప్పటికే ప్రభుత్వం సుమారు రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసిందని, కొన్ని చోట్ల కాల్వల నిర్మాణం కూడా జరిగిందని అధికారులు వివరించారు.
మహారాష్ట్రతో చర్చించి 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే కనీసం 100 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఇంజనీరింగ్ నిపుణులు సూచించారు. మహారాష్ట్రలో ఎక్కువ ముంపు లేకుండా మధ్యేమార్గంగా 150 మీటర్ల ఎత్తు నిర్మిస్తే తక్కువ ఖర్చు తో నీటిని తీసుకునే వీలుందని వారు స్పష్టం చేశారు.
ప్రాజెక్ట్ ప్రాధాన్యత దృష్ట్యా వెంటనే మహారాష్ట్ర తో సంప్రదింపులు జరపాలని, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున వారితో సంప్రదింపులు, పరిష్కార సాధన కోసం రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వెంటనే లేఖ రాసి, ఆయన సహకారం తీసుకోవాలని సూచించాను అని అన్నరు..
మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్దరణ చర్యల్లో భాగంగా చేపడుతున్న జియో టెస్టింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాను…