SRH VS MI…
ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కలిసి తొలి వికెట్‌కి 129 పరుగుల భాగస్వామ్యం
పాయింట్ల పట్టికలో ఆరెంజ్ ఆర్మీ మూడో ప్లేస్..
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జైత్రయాత్ర కొనసాగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ పోరులో ఆరెంజ్ ఆర్మీ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసిన ప్యాట్ కమిన్స్ సేన, పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ముంబై నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి, ఈ సీజన్లో తాము ఎందుకు ఫేవరెట్లలో ఒకరో మరోసారి నిరూపించుకుంది..
రికెల్టన్ భారీ సెంచరీ కారణంగా 244 పరుగుల భారీ స్కోరు చేసినా బౌలర్ల ఫెయిల్యూర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల విద్వంస
బ్యాటింగ్ కారణంగా ముంబై ఇండియన్స్ మరో పరాజయాన్ని మూటకట్టుకుంది. ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో నెగ్గిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, సీజన్లో వరుసగా 5వ విజయాన్ని అందుకుని, ప్లేఆఫ్స్‌కి చేరువైంది..244 పరుగుల లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కలిసి తొలి వికెట్‌కి 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి బాదుడుకి పవర్ ప్లేలోనే 92 పరుగులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌పై ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోరు…
24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేసిన అభిషేక్ శర్మను ఘజన్ఫర్ అవుట్ చేశాడు. ఆ తర్వాతి బంతికి ఇషాన్ కిషన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇషాన్ కిషన్ గోల్డెన్ డకౌట్ కావడంతో వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్…
మంచి భాగస్వామ్యం..
ఈ దశలో హెన్రీచ్ క్లాసిన్, నితీశ్ కుమార్ రెడ్డి కలిసి నాలుగో వికెట్‌కి 40 బంతుల్లో 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 17 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసిన నితీశ్ కుమార్ రెడ్డిని ట్రెంట్ బౌల్డ్ అవుట్ చేశాడు.
అయితే అప్పటికి సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 22 బంతుల్లో 31 పరుగులు మాత్రమే కావాలి. సలీల్ అరోరా ఓ ఫోర్, 3 సిక్సర్లతో మ్యాచ్‌ని ముగించేశాడు. హెన్రీచ్ క్లాసిన్ 30 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 65 పరుగులు చేయగా సలీల్ అరోరా 10 బంతుల్లో 30 పరుగులు చేశాడు.
ముంబైకి షాక్: ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు?.
సొంత మైదానంలో 243 పరుగులు చేసినప్పటికీ, ఆ స్కోరును కాపాడుకోలేకపోవడం ముంబై ఇండియన్స్‌ను ఆత్మరక్షణలో పడేసింది. ఈ సీజన్లో ముంబైకి ఇది ఆరో ఓటమి. ఈ పరాజయంతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై టీమ్ ప్లేఆఫ్స్ రేసులో దాదాపు వెనుకబడింది. మరోవైపు, ఈ విజయంతో SRH ఈ సీజన్లో మొత్తం 6 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ మరియు సమన్వయంతో ఆడుతున్న సన్‌రైజర్స్, ఈసారి టైటిల్ వేటలో అత్యంత ప్రమాదకరమైన జట్టుగా అవతరించింది.
పాయింట్ల పట్టికలో ఆరెంజ్ ఆర్మీ మూడో ప్లేస్.
ప్రస్తుత ఫామ్ చూస్తుంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకున్నట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా కీలక సమయాల్లో ఆటగాళ్లు సమష్టిగా రాణించడం ఆ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు కెప్టెన్సీలోనూ కమిన్స్ వ్యూహాలు అద్భుతంగా పని చేస్తున్నాయి. ఇకపోతే ముంబై జట్టు తన తదుపరి మ్యాచ్‌లలో అద్భుతాలు చేస్తే తప్ప ప్లేఆఫ్స్ చేరడం అసాధ్యంగా మారింది. వాంఖడేలో సన్‌రైజర్స్ నమోదు చేసిన ఈ విజయం ఈ సీజన్లోనే అత్యుత్తమ ఛేజింగ్‌లలో ఒకటిగా నిలిచిపోతుంది..