శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మృతులకు కేటీఆర్ నివాళులు.

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మృతులకు కేటీఆర్ నివాళులు

సిరిసిల్ల బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ కుటుంబ సభ్యుల మృతదేహాలకు ఉస్మానియా ఆసుపత్రిలో నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలో నెహ్రు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు మార్గంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పై శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొనడంతో ఈఘోరం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన స్థానికులను, తోటి వాహనదారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది..