కేసీఆర్ను కవిత అంటున్న మాటలు తెలంగాణ ప్రజలు చూసి ఛీత్కరించుకుంటున్నారు.
కేసీఆర్ను అంటే ప్రజలు నన్ను గుర్తు పడతారని ఆమె అనుకుంటుంది.. కానీ ఆమెకు అంతో ఇంతో ఉన్న విలువను కూడా కోల్పోయారు
ఆమె ఎవరి చేతిలో కీలు బొమ్మ అయిందో ప్రజలందరికి తెలుసు
రాజకీయంగా కవితకు కేసీఆర్ అనేక అవకాశాలు ఇచ్చారు
ఇచ్చిన అవకాశాలు కవిత నిలుపుకోలేక పోయారు
కవిత రాజకీయ నాయకురాలిగా పనికిరారు – బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద..
కవిత ఎవరి చేతిలో కీలు బొమ్మగా మారారో ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అర్థమైందని అన్నారు. తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆరే అని పునరుద్ఘాటించారు. ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజల కార్యక్రమం అన్నారు కానీ, అందులో ఇప్పటికే 60 రోజులు పూర్తయిందని ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదని విమర్శించారు…రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో ప్రజలను వంచించే పాలన నడుస్తున్నదని, మొదటి దఫా తీసుకున్న దరఖాస్తులతోనే కాలం గడుపుతున్నారని వివేకానంద మండిపడ్డారు. రాష్ట్రంలో కొత్తగా సంక్షేమ పథకాలు ప్రకటించకపోగా.. ఉన్న వాటిని కూడా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి కూడా మంచి చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం తాగటానికి నీరు లేక మహిళలు బిందెలతో రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తాగు నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగను అని శపథం చేసిన నాయకుడు కేసీఆర్ అని గుర్తుచేశారు. రాష్ట్రంలో చాలాచోట్ల ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయని చెప్పారు. రాజీవ్ యువ వికాసం ప్రకటించి ఏడాదైనా.. ఒక్కరికైనా అందిందా? అని ప్రశ్నించారు…