హర్మూజ్ జలసంధిని దాటిన భారత నౌక.
భారత నౌకలో 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ.
ఈనెల 13న విశాఖ చేరుకోనున్న ఎల్పీజీ నౌక…
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా దేశంలో ఇంధన కొరత ఏర్పడింది. ఈ సమస్య మరింతగా జఠిలం కాకుండా కేంద్రం తగిన చర్యలు చేపడుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్కు చెందిన రెండు ఎల్పీజీ నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. ఇది ఒకింత ఉపశమనం కలిగిస్తోంది. ఈ రెండు ఎల్పీజీ నౌకలు హర్మూజ్ను దాటి అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి ప్రవేశింనట్టు వార్తా కథనాలు వస్తున్నాయి.
ఉద్రిక్తతల కారణంగా భారత్కు చెందిన నౌకలు రోజులతరబడి అక్కడే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మన నౌకలు సురక్షితంగా హర్మూజ్ దాటేందుకు.. ఇరాన్ అధికారులతో కేంద్రం నిరంతరం సంప్రదింపులు జరిపింది. దీంతో కొన్ని రోజులుగా భారత నౌకలు ఒక్కొక్కటిగా దేశీయ పోర్టులకు చేరుకుంటున్నాయి