రాష్ట్రపతి పాలన దిశగా తమిళనాడు అడుగులు వేస్తోందా? ఓటర్లు ఏ పార్టీకి కావాల్సిన మెజార్జీ ఇవ్వకపోవడంతో ఉత్కంఠగా మారింది? తమ పార్టీ ఎమ్మెల్యేలు, మిత్రులు బయటకు వెళ్లకుండా డీఎంకె, అన్నాడీఎంకే కట్టడి చేశాయా? ఆనాడు కరుణానిధి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారా? ఇప్పుడు విజయ్ వంతు అయ్యిందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
రాష్ట్రపతి పాలన దిశగా తమిళనాడు
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసలైన రాజకీయాలు మొదలయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీకే అధికారంలోకి రాకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి డీఎంకె-అన్నాడీఎంకె. తమ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, కనీసం మిత్రులు సైతం బయటకు పోకుండా జాగ్రత్తగా చర్యలు చేపట్టారు. ఈ రెండు పార్టీల నేతలు చర్చల మీద చర్చలు జరుపుతున్నారు.
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్ మరో ఆరు సీట్ల దూరంలో ఉన్నాయి. ఆయనకు మద్దతు ఇచ్చేందుకు చిన్నపార్టీలు ముందుకు రాలేదు. అటు డీఎంకె నుంచి గానీ, ఇటు అన్నాడీఎంకె కూటమి నేతలు బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. దీంతో క్షణక్షణం అక్కడి రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. ఈ పరిస్థితి ముందుగా ఊహించిన దళపతి విజయ్, గెలిచిన తమ పార్టీ ఎమ్మెల్యేలను రిసార్ట్స్ తరలించారు.