ప్రైవేటు నివాసం వద్ద పుతిన్‌పై ఉక్రెయిన్ హత్యాయత్నానికి పాల్పడినట్లు మాస్కో Mascow అధికారిక వర్గాలు వెల్లడి..!
రష్యా అధ్యక్షుడు (Russia President) వ్లాదిమిర్ పుతిన్ (Vlodimir Putin) కు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భద్రతా వలయం ఉంటుంది.
దానిని దాటుకొని ఆయనపై హత్యాయత్నం (Assassination Attempt) జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ (Ukrain) తో యుద్ధం నేపథ్యంలో కొన్ని నెలల క్రితం నోవ్గోరోడ్ ప్రాంతంలోని ప్రైవేటు నివాసం వద్ద పుతిన్‌పై ఉక్రెయిన్ హత్యాయత్నానికి పాల్పడినట్లు మాస్కో Mascow అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆయనను హతమార్చడానికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ విషయాన్ని బయటకు వెల్లడించలేదని తెలిపాయి. ఈ క్రమంలోనే రష్యా ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ (FSO) పుతిన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది…ఈ కుట్ర నేపథ్యంలో ఆయన బహిరంగ పర్యటనలను గణనీయంగా తగ్గించుకున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యుద్ధ ప్రయత్నాలను పర్యవేక్షిస్తూ పుతిన్ ఎక్కువ కాలం భూగర్భ బంకర్లలోనే ఉంటున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఆయన ఉంటున్న ప్రదేశంలో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న పరికరాలపై నిషేధం విధించినట్లు తెలిపాయి. ఉక్రెయిన్ డ్రోన్ల ముప్పు ఎదుర్కోవడానికి ఎఫ్ఎస్ఓ ఏజెంట్లు భద్రతా తనిఖీలను విస్తరించారని, మాస్కో నది వెంబడి బలగాలను మోహరించారని పేర్కొన్నాయి.
దేశంలోని పలువురు ఉన్నతాధికారుల రక్షణను కూడా పెంచినట్లు సమాచారం. రష్యా అధ్యక్షుడిని నేరుగా లక్ష్యంగా చేసుకొన్నట్లు వస్తున్న వార్తలను అమెరికా, ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్‌లు తోసిపుచ్చాయి. కాగా గతంలోనూ పుతిన్‌పై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి…