తిరుమల దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. పండుగలు, ప్రత్యేకమైన రోజులు, బ్రహ్మోత్సవాలు, వీకెండ్, వరుస సెలవులు, వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. ఈ ప్రభావం అలిపిరి టోల్గేట్ దగ్గర కనిపిస్తోంది.. వాహనాలను తనిఖీ చేసేందుకు గంటల తరబడి భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అందుకే తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది. తిరుపతి నుంచి తిరుమల వెళ్లేందుకు అలిపిరి టోల్ గేట్ దగ్గర వాహనాల రద్దీని తగ్గించేందుకు టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బస్సుల తనిఖీల కోసం అలిపిరిలోని శ్రీ వినాయకస్వామి ఆలయ సమీపంలో రూ.4.25 కోట్లతో శాశ్వత షెల్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.. అలిపిరి సప్తగిరి టోల్‌గేటు దగ్గర తిరుమల వెళ్లే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందుల్ని గమనించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల కోసం ప్రత్యేకంగా అలిపిరి వినాయక స్వామి ఆలయం సమీపంలో లైన్లు ఏర్పాటు చేసి,..ప్రయాణికులకు కోసం శాశ్వత షెడ్లు నిర్మించాలని టీటీడీ పాలకమండలిలో నిర్ణయం తీసుకుని ఆమోదించింది. మొత్తం రూ. 4.25 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రెండు ప్రత్యేక బస్సు లైన్లను 3.75 మీటర్ల వెడల్పుతో నిర్మాణం చేయనున్నారు. ఇక్కడ ఒకేసారి ఏకంగా 80 బస్సులు ఆగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రూ.2.02 కోట్లతో ప్రయాణికుల కోసం అత్యాధునిక శాశ్వత షెడ్లను 60 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. త్వరలో అలిపిరిలో నిర్మించే తనిఖీల లైన్ల కోసం లగేజీ స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు, ప్రత్యేక విభాగాల ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు అక్కడ కొండ చరియలు విరిగిపడకుండా ఆర్సీసీ రిటెయినింగ్ వాల్, లైటింగ్, యూపీఎస్ ఏర్పాటు చేయనున్నారు.. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే వాహనాల కోసం ప్రస్తుతం అలిపిరి దగ్గర 13 లైన్ల టోల్‌ప్లాజా అందుబాటులో ఉంది. సాధారణ రోజుల్లో తిరుమలకు ఆరు వేల నుంచి ఎనిమిది వేల వాహనాలు వెళుతుంటాయి. తిరుమలలో పండగ రోజులు, వీకెండ్, బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు రద్దీ పెరుగుతుంది.. ఆ సమయంలో వాహనాల సంఖ్య 12 వేల వరకు ఉంటుటుంది. రద్దీ పెరిగిన సమయంలో అలిపిరి నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాలు బారులు తీరి ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి.. భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు టీటీడీ అలిపిరి వినాయక స్వామి గుడి వద్ద ప్రత్యేక బస్సు లైన్లు నిర్మించనుంది. టోల్‌ప్లాజా ఎగ్జిట్ పాయింట్ నుంచి దాదాపు 600 మీటర్ల దూరంలోనే ఇది ఉంటుంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.