కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇంకా ఎందుకు అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రశ్నించారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, రాష్ట్ర హోం శాఖను దగ్గర పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కై ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకోసం బాధిత కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు….
మైనర్ బాలిక కు న్యాయం చేయకుండా, బండి సంజయ్ కుమారుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని,రాష్ట్రంలో పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు.
జరిగిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవికి రాజీనామా చేయాలని,సియం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, లేని యెడల…బాధితుల పక్షాన బి ఆర్ ఎస్ పార్టీ కొట్లాడుతుందని స్పష్టం చేశారు..