పంతొమ్మిదో సీజన్లో ప్లే ఆఫ్స్ పోరులో కోల్కతా నైట్ రైడర్స్(KKR) నిలిచింది. గెలిచి తీరాల్సిన మ్యాచ్లో టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు షాకిస్తూ కీలకమైన రెండు పాయింట్లు సాధించింది. శనివారం ఈడెన్ గార్డెన్స్లో ఫిన్ అలెన్(93), రఘువంశీ(82 నాటౌట్)లు తుఫాన్ ఇన్నింగ్స్తో 247 రన్స్ కొట్టిన కోల్కతా.. ఆపై ప్రత్యర్థిని కట్టడి చేసింది. శుభ్మన్ గిల్(85), బట్లర్() అర్ధశతకాలతో పోరాడినా సరిపోలేదు. ఈ విజయంతో రహానే బృందం ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది..ఐపీఎల్ 19లో ప్లే ఆఫ్స్ రేసు రోజురోజుకు ఆసక్తికరంగా సాగుతోంది. ఇక కష్టమే అనుకున్న జట్లు సంచలన విజయాలతో ముందున్న జట్లకు షాకిస్తున్నాయి. మొన్న ముంబై ఇండియన్స్, నిన్న లక్నో సూపర్ జెయింట్స్ .. ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్ సూపర్ విక్టరీతో నాకౌట్ పోరును ఉత్కంఠగా మార్చేశాయి. తొలుత గుజరాత్ బౌలర్ల భరతం పడుతూ ఓపెనర్ ఫిన్ అలెన్(93), రఘువంశీ(82 నాటౌట్)లు భారీ స్కోరందించగా.. అనంతరం బౌలర్లు గొప్పగా కట్టడి చేశారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.