నడిరోడ్డుపై మూడు వాహనాలు దగ్ధం.
రైల్వే కోడూరు మండలం బాలుపల్లి చెక్ పోస్ట్ వద్ద ప్రమాదం.
లారీని వెనుక నుంచి ఢీకొన్న ఇన్నోవా కారు.
ఇన్నోవా కారును ఢీకొన్న మరో కారు.
ముగ్గురికి గాయాలు తిరుపతి ఆస్పత్రికి తరలింపు .
మంటల్లో మూడు వాహనాలు దగ్ధం.
సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది .
ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఒక ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ఇన్నోవా కారును మరో కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, చూస్తుండగానే మూడు వాహనాలు అగ్నికీలల్లో చిక్కుకుని పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కాపాడి, మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంతో రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.