హైదరాబాద్ చార్మినార్ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మదీనా చౌరస్తా సమీపంలోని ఎస్వైజే కాంప్లెక్స్లోని ఓ బట్టల దుకాణంలో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు…ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఐదు అగ్నిమాపక కేంద్రాల సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి వారు రెండు గంటలుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అత్యంత రద్దీగా ఉండే వ్యాపార సముదాయంలో ఈ అగ్నిప్రమాదం జరగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు, వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు పక్కనే ఉన్న ఇతర భవనాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.