ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో హైఅలర్ట్ ..ప్రాణాంతాక వైరస్ వ్యాప్తి చెందుతుందని బోర్డులు.. ఉన్నట్టుండి ప్రయాణికులకు స్క్రీనింగ్ టెస్టులు..డిస్టెన్స్ పాటించాలని సూచనలు..
India on Alert as Ebola Cases Surge in Africa
ప్రాణాంతక ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఢిల్లీ ఎయిర్ పోర్టులో కట్టుదిట్టమైన ఆరోగ్య భద్రతా ఏర్పాట్లు చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ. కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ లాంటి దేశాలను వచ్చేవారికి హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది,, ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎబోలా వైరస్ హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇటీవల ఆఫ్రికాలోని కాంగో (DRC), ఉగాండా దేశాల్లో ఎబోలా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్తగా విమానాశ్రయాల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే మన దేశంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగానే ఈ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.
విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ ..
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) జారీ చేసిన తాజా గైడ్లైన్స్ ప్రకారం ..ఎబోలా ప్రభావిత దేశాలైన కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ ల నుంచి వచ్చే ప్రయాణికులు, ఆయా దేశాల మీదుగా ప్రయాణించే వారిని ప్రత్యేకంగా టెస్టులు చేస్తున్నారు. ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులలో ఎవరికైనా లక్షణాలు ఉంటే, వారు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కంటే ముందే ఎయిర్పోర్ట్ హెల్త్ ఆఫీసర్ (APHO) లేదా హెల్త్ డెస్క్ వద్ద రిపోర్ట్ చేయాలని సూచించింది .ఒకవేళ ఎయిర్ పోర్టులో బాగుండి, ఇంటికి వచ్చిన తర్వాత 21 రోజులలోపు లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించి తమ ట్రావెల్ హిస్టరీని తెలపాలని కోరింది.