యాదాద్రి భువనగిరి జిల్లా:
యాదాద్రిలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
యాదాద్రి కొండకు పక్కనే ఉన్న టెంపుల్ సిటీ పై వేదపాఠశాల, కొండపైన కళ్యాణ మండపం, దీక్షపరుల సదనం, కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు, ప్రధానాలయ వాయువ్య దిశలో మెట్లమార్గం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
సీఎం పర్యటన నేపథ్యంలో అధికా రులు, ఇటు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
హెలీప్యాడ్ నుండి సీఎం ప్రయాణించడానికి కాన్వాయ్ బందోబస్తు, టెంపుల్ సిటీ పైన శంకుస్థాపన చేసే ప్రాంతంలో జర్మన్ హంగర్ షేడ్స్ తో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
హెలీప్యాడ్ తో పాటు సీఎం పర్యటించే ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
సీఎం పర్యటన నేపథ్యంలో… ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట మైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు.
ఆలయానికి వచ్చే భక్తులకు,సీఎం పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు..
అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రేపు జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి ఇవ్వాళ ఆలయానికి విచ్చేసిన కంచికామ కోటీ పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి.