కాలనీలో పిల్లలు క్రికెట్ ఆడారని వారి తల్లిదండ్రులపై దాడి చేసి.. దొంగతనం చేశారని తప్పుడు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత..!
కాలనీలో పిల్లలు క్రికెట్ ఆడారని వారి తల్లిదండ్రులపై దాడి చేసి.. దొంగతనం చేశారని తప్పుడు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత..
రాత్రివేళ దంపతుల్ని పోలీస్ స్టేషన్కు పంపించి వేధింపులకు గురిచేసి.. కాళ్లు మొక్కితేనే కేసు వాపస్ తీసుకుంటానని బెదిరింపు..
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీ నేత లుకస్ అరాచకం..
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..
బిహార్కు చెందిన లీలావతి, ఆమె భర్త ఉప్పల్ ఐడీఏ ప్రాంతంలోని లక్ష్మీనారాయణ కాలనీలో నివాసం ఉండగా.. మే 25న సాయంత్రం మరికొంత మందితో కలిసి కాలనీలోని రోడ్డుపై క్రికెట్ ఆడిన వారి ఇద్దరు కుమారులు..
అదే కాలనీలో ఉండే కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా నేత లుకస్.. నా ఇంటి ముందే క్రికెట్ ఆడుతారా అంటూ బూతులు తిడుతూ రోడ్డెక్కి, ప్రశ్నించిన లీలావతి పై తిడుతూ దాడి..
లీలవతి వస్త్రం చినిగిపోవడంతో.. అడ్డుకోబోయిన ఆమె భర్తపై సైతం రక్తం వచ్చేలా దాడి..
అంతటితో ఆగకుండా అధికార మదంతో దాడి చేసిన వ్యక్తే ఉప్పల్ పోలీసులకు సమాచారమిచ్చి, పోలీస్ స్టేషన్లో వేయించిన వైనం..
తమపై జరిగిన దాడిని వివరించి ఫిర్యాదు చేసేందుకు బాధితులు ప్రయత్నించగా కేసు నమోదు చేయడానికి నిరాకరించిన పోలీసులు..
దాడి వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో తప్పు కప్పిపుచ్చుకోవడానికి సదరు కాంగ్రెస్ నేత అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు వెళ్లి.. లీలావతి కుటుంబం తన బంగారు గొలుసు దొంగతనం చేసిందని ఫిర్యాదు…
దీంతో ఆ దంపతులు ఆందోళనతో తమపై చోరీ కేసు పెట్టొద్దని ప్రాధేయపడగా.. తన కాళ్లు మొక్కి, తప్పు చేశామని ఒప్పుకుంటేనే ఫిర్యాదు వెనక్కి తీసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డ కాంగ్రెస్ నేత లుకస్..కాలనీలో పిల్లలు క్రికెట్ ఆడారని వారి తల్లిదండ్రులపై దాడి చేసి.. దొంగతనం చేశారని తప్పుడు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
దీంతో గత్యంతరం లేక పోలీసుల సాక్షిగా కాళ్లు మొక్కిన బాధితులు..
బాధితుల కథనం ప్రకారం.. బిహార్కు చెందిన లీలావతి దంపతులు ఉప్పల్ ఐడీఏ ప్రాంతంలోని లక్ష్మీనారాయణ కాలనీలో నివాసం ఉంటున్నారు. మే 25వ తేదీన సాయంత్రం వారి ఇద్దరు కుమారులు మరికొంతమంది పిల్లలతో కలిసి కాలనీలోని రోడ్డుపై క్రికెట్ ఆడుకున్నారు. పిల్లలు ఆడుకోవడంపై అదే కాలనీలో ఉండే కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా నేత లుకస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ విషయంపై అడగడానికి వెళ్లిన లీలావతిని లుకస్ తిడుతూ దాడికి దిగాడు. ఈ ఘటనలో లీలావతి దుస్తులు చినిగిపోయాయి. అయినా వదలకుండా లుకస్ దాడి చేశాడు. అడ్డొచ్చిన ఆమె భర్తపైనా దాడి చేశాడు…అంతటితో ఆగకుండా అధికారమదంతో పోలీసులకు ఉల్టా కంప్లయింట్ స్టేషన్లో పెట్టించాడు. తమపైనే దాడి జరిగిందని బాధితులు చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా పోలీసులు వినిపించుకోలేదు. కాంగ్రెస్ నేతపై కేసు నమోదు చేయడానికి నిరాకరించాడు. ఇదిలా ఉంటే దాడి ఘటనకు సంబంధించిన వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్గా మారాయి. దీంతో తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అర్ధరాత్రి వేళ పోలీస్ స్టేషన్కు వెళ్లి లీలావతి కుటుంబంపై దొంగతనం కేసు పెట్టాడు.
దీంతో భయాందోళనకు గురైన దంపతులు తమపై చోరీ కేసు పెట్టవద్దని లుకస్ను వేడుకున్నారు. ఈ క్రమంలో కాళ్లు మొక్కి తప్పు చేశామని ఒప్పుకుంటేనే ఫిర్యాదు వెనక్కి తీసుకుంటానని లుకస్ బెదిరించాడు. గత్యంతం లేక పోలీసుల సమక్షంలోనే బాధితులు కాళ్లు మొక్కి వచ్చేశారు..