ఇచ్చిన డబ్బులు అడిగితే ఇంటిని పెట్రోల్ పోసి తగలబెట్టిన వ్యక్తి….

ఇచ్చిన డబ్బులు అడిగితే ఇంటిని పెట్రోల్ పోసి తగలబెట్టిన వ్యక్తి….

ఇచ్చిన డబ్బులను తిరిగి చెల్లించాలని అడిగినందుకు డబ్బులు తీసుకున్న వ్యక్తి డీజిల్ తీసుకువచ్చి అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటిని తగులబెట్టిన సంఘటన ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో చోటుచేసుకుంది.

ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో రాజమల్లు అనే వ్యక్తి ఇంటిని అబ్దుల్ బారీ అనే వ్యక్తి డిజిల్ పోసి ఇంటికి నిప్పంటించాడు. స్థానికులు నిందితున్ని పట్టుకొని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. బాధితులు రాజమల్లు మాట్లాడుతూ అబ్దుల్ బారి అనే వ్యక్తి నుండి తనకు 5 లక్షల రూపాయలు రావాలని, ఆరు సంవత్సరాల నుండి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడనీ,డబ్బులు అడిగినందుకు తమ ఇంట్లో 30 లీటర్ల డీజిల్ క్యాన్ తీసుకొచ్చి డీజిల్ పోసి ఇంటికి నిప్పటించాడని, ఇంటితో పాటు, తమపై సైతం డీజిల్ పోశాడని, కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పినా వినకుండా అగ్గిపుల్లను గీసేసాడని అన్నారు. తాము ఎంతో ఆశతో కట్టుకున్న ఇల్లు పూర్తిగా దగ్ధమైందని, ఇంటితో పాటు ఇంట్లో ఉన్న సామాన్లు సైతం పూర్తిగా కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితున్ని కఠినంగా శిక్షించి, తనకు న్యాయం చేయాలని కోరాడు.