తొలి రోజు ఆటలో టీమ్ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్ ఇరవై ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు ఒక భారీ షాట్ కొట్టాడని, ఆ బంతి కాస్త స్టేడియంపై ఎగురుతున్న డ్రోన్‌ను బలంగా తాకడంతో అది కిందపడిపోయిందనేది ఆ వీడియో సారాంశం. ఈ దృశ్యాలను చూసి చాలా మంది క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం ప్రారంభించారు. అయితే, ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు నిజానిజాలను పరిశీలిస్తే ఇది ముమ్మాటికీ నకిలీ వీడియో అని తేలిపోయింది. టెక్నాలజీని ఉపయోగించి సృష్టించిన ఈ ఫేక్ కంటెంట్ నెటిజన్లను తీవ్రంగా గందరగోళానికి గురిచేస్తోంది.
Ai సృష్టి అంటు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు…
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించే ప్రతీ వీడియో, వార్త నిజం కాకపోవచ్చని.. ఇటువంటి వీడియోలు చూసినప్పుడు వాటిని బ్లైండ్‌గా నమ్మకుండా ఒకటికి రెండుసార్లు నిజానిజాలు సరిచూసుకోవాలని క్రీడాభిమానులు, నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, రిషభ్ పంత్ డ్రోన్‌ను కూల్చేశాడనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అది కేవలం ఒక ఫేక్ వీడియో మాత్రమేనని స్పష్టమవుతోంది.
https://x.com/i/status/2063539436357615647