కొండాపూర్ లో మునిగిన కారు..!

కొండాపూర్ లో మునిగిన కారు..!

మాదాపూర్, కొత్తగూడ ప్రాంతాలలో సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.

కొత్తగూడ ఫ్లైఓవర్ దగ్గర భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్లలోకి నీరు చేరడంతో అవి నడిరోడ్డుపైనే నిలిచిపోయాయి.

మాదాపూర్ సున్నం చెరువు సమీపంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే చందానగర్ దీప్తి శ్రీనగర్ రోడ్డుపై కూడా భారీగా నీరు చేరింది.

తాజాగా కురిసిన 5.6 మి.మీ వర్షానికే రోడ్లు చెరువులను తలపించగా, భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని హైటెక్ సిటీ వాసులు ఆందోళన చెందుతున్నారు.