నీట్ రీ-టెస్ట్ కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రుల కష్టాలు, కనికరించి యంత్రాంగం..!.నిబంధనల ముసుగులో మానవత్వం లేని మృగాలుగా మారుతున్నారా..?.
విద్యార్థుల జీవితాలను, వారి రక్తాన్ని, చెమటను గాల్లో కలిపేస్తూ పేపర్ లీక్ చేసినప్పుడు ఈ విద్యావ్యవస్థ ఎక్కడికి పోయింది? ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి 23 లక్షల మంది విద్యార్థులను నెలల తరబడి తీవ్ర ఆందోళనలోకి నెట్టేసి, మళ్లీ పరీక్ష రాసుకోవచ్చని ‘రెండో అవకాశం’ ఇవ్వవచ్చు..కానీ, అదే విద్యార్థి రోడ్డు మీద ట్రాఫిక్ వల్లో, వర్షం వల్లో, బైక్ పంక్చర్ కావడం వల్లో కేవలం రెండు నిమిషాలు ఆలస్యంగా వస్తే గేట్లు మూసేస్తారా? ఇది క్రమశిక్షణా? లేక వ్యవస్థలోని నిర్లక్ష్యపు అహంకారమా?
https://www.facebook.com/share/v/1GqihnBMN9/
పేపర్ లీక్ అయితే క్షమాపణ.. రెండు నిమిషాలు లేట్ అయితే శిక్షా?
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షను సక్రమంగా నిర్వహించలేక చేతులెత్తేసిన అధికారులపై తక్షణ చర్యలు లేవు. విద్యాశాఖ మంత్రికి, ప్రభుత్వానికి పేపర్ లీకులను అరికట్టడానికి సమయం దొరకలేదు కానీ, తప్పు దిద్దుకోవడానికి మాత్రం దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్ష పెట్టే అధికారం దొరికింది.
తమ తప్పు ఏమీ లేకపోయినా నెల రోజులుగా నరకం అనుభవించి, మళ్లీ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులపై మాత్రం ‘ఒక్క నిమిషం’ నిబంధనను కఠినంగా ప్రయోగించారు. ఇదా మీ న్యాయం? పేపర్ లీక్ చేసి లక్షలాది మంది భవిష్యత్తును నాశనం చేసిన వ్యవస్థకు లభించిన క్షమాపణ… ఊహించని ప్రమాదాల వల్ల రెండు నిమిషాలు ఆలస్యమైన విద్యార్థికి ఎందుకు లభించలేదు?
ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలు, బయోమెట్రిక్ ధృవీకరణ, సీసీటీవీ నిఘా, జామ్మర్లు, తనిఖీ విధానాలు మరియు పోలీసు, పరిపాలనా సిబ్బందిని భారీ స్థాయిలో మోహరించారు. మరో పేపర్ లీక్ వివాదం జరగకుండా అధికారులు నిర్ధారించుకునే ప్రయత్నంలో భాగంగా 1.38 లక్షలకు పైగా సీసీటీవీ కెమెరాలు మరియు సుమారు 50,000 జామ్మర్లను ఉపయోగించినట్లు సమాచారం.
అయినప్పటికీ సాయంత్రానికల్లా, సోషల్ మీడియాలో భద్రత గురించి చర్చ జరగలేదు. తాళం వేసిన గేట్ల బయట నిలబడి ఉన్న విద్యార్థుల గురించే చర్చ జరిగింది.
భారతదేశవ్యాప్తంగా, మధ్యాహ్నం 1:30 గంటలకు గేట్లు మూసే గడువును నిమిషాల తేడాతో దాటిన అభ్యర్థులను పరీక్షా కేంద్రాల నుంచి వెనక్కి పంపిస్తున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
అత్యంత విస్తృతంగా షేర్ చేయబడిన సంఘటనలలో ఒకటిగా, మధ్యప్రదేశ్‌లో భారీ వర్షం మరియు మోటార్‌సైకిల్ టైర్ పంక్చర్ అవ్వడం వల్ల ఒక విద్యార్థిని ప్రయాణం ఆలస్యం కావడంతో, ఆమె కేవలం రెండు నిమిషాలు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకుంది. ఆమె తండ్రి పరీక్షా కేంద్రం బయట కుప్పకూలిపోయారు. చివరికి ఆమెను లోపలికి అనుమతించినప్పటికీ, బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి కాకపోవడంతో ఆమె పరీక్ష రాయలేకపోయింది…
నిబంధనల ముసుగులో మానవత్వం లేని మృగాలుగా మారుతున్నారా..?.
మధ్యప్రదేశ్‌లోని విదిశలో ఒక విద్యార్థిని వర్షం, బైక్ పంక్చర్ కారణంగా కేవలం రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. అధికారులు లోపలికి రానివ్వకపోవడంతో, ఆ కన్నతండ్రి పరీక్షా కేంద్రం బయట రోడ్డుపై పడి ఏడ్చిన ఏడుపు ఈ మొద్దుబారిన వ్యవస్థకు వినపడలేదా..? అధికారులు కనికరించి లోపలికి పంపినా… అప్పటికే బయోమెట్రిక్ సిస్టమ్ లాక్ అయిపోయిందనే సాంకేతిక సాకుతో ఆమెను పరీక్ష రాయనివ్వలేదు.
బెంగళూరులో, గేటు మూసివేసే నిర్ణీత సమయం తర్వాత కేవలం రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ముగ్గురు నీట్ పునఃపరీక్ష అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. కాంగ్రెస్ ర్యాలీ కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ రద్దీయే ఈ ఆలస్యానికి కారణమని వారి తల్లిదండ్రులు ఆరోపించారు.
బెంగళూరులోని ఆర్సి ప్రభుత్వ కళాశాలలో ఈ సంఘటన జరిగింది. అక్కడ పరీక్షా కేంద్రం ప్రధాన ద్వారం సరిగ్గా మధ్యాహ్నం 1:30 గంటలకు మూసివేశారు. కేవలం రెండు నిమిషాల తర్వాత, మధ్యాహ్నం 1:32 గంటలకు, ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయడానికి వచ్చారు, కానీ అప్పటికే గేట్లు మూసివేశారు..
అయితే, మధ్యాహ్నం 1:32 గంటలకు ముగ్గురు మహిళా అభ్యర్థులు కేంద్రానికి చేరుకోగా, గేట్లు అప్పటికే తాళం వేసి ఉన్నాయి. లోపలికి ప్రవేశించే వారి ప్రయత్నాలు విఫలమవడంతో, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
నిస్సహాయ స్థితిలో, విద్యార్థులు ప్రధాన ద్వారం రెయిలింగ్‌ను దాటి క్యాంపస్‌లోకి ప్రవేశించారు. కానీ పరీక్షా నిబంధనల ప్రకారం పరీక్షా హాలు ప్రవేశద్వారాన్ని కూడా మూసివేశారని తెలుసుకుని వారి ఆశలు అడియాశలయ్యాయి..
తెలంగాణలోని జగిత్యాలలో ఒక తల్లి తన కూతురి భవిష్యత్తు కోసం అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కాళ్లపై పడి ప్రాధేయపడింది. బెంగళూరులో ముగ్గురు విద్యార్థినులు రాజకీయ ర్యాలీ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి, సమయానికి చేరలేక ఏడుస్తూ కాలేజీ గోడలు ఎక్కి దూకినా లోపలి గేట్లు వేసి వారిని వెనక్కి పంపేశారు. ఈ దృశ్యాలు చూస్తుంటే ఒకటి స్పష్టమవుతోంది.. మన విద్యావ్యవస్థ నడుపుతోంది మనుషులు కాదు, మానవత్వం లేని యంత్రాలు అని… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ గా మారాయి..
కాంగ్రెస్ ర్యాలీ కారణంగా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.!?
కేంద్రం వెలుపల వేచి ఉన్న తల్లిదండ్రులు, అభ్యర్థులు సమయానికి ఇంటి నుండి బయలుదేరినప్పటికీ, నగరంలో జరిగిన కాంగ్రెస్ ర్యాలీ కారణంగా ఏర్పడిన భారీ ట్రాఫిక్ వల్ల ఆలస్యమయ్యారని పేర్కొన్నారు. నిర్ణీత సమయానికి ముందే సభాస్థలికి చేరుకోవడానికి విద్యార్థులు ప్రయత్నించినప్పటికీ, కేవలం రెండు నిమిషాల తేడాతో గడువును కోల్పోయారని వారు తెలిపారు.
తమ విద్యా భవిష్యత్తుపై పడే ప్రభావం గురించి భయపడిన విద్యార్థులు, పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని వేడుకుంటుండగా, పరీక్షా కేంద్రం వెలుపల నెలకొన్న భావోద్వేగ దృశ్యాలు అక్కడివారి దృష్టిని ఆకర్షించాయి. అయినప్పటికీ, అధికారులు నిర్దేశించిన ప్రవేశ నిబంధనలను పాటిస్తూ వారిని లోపలికి అనుమతించలేదు.