లంచం కేసులో జైలులో ఉన్న తహసీల్దార్ ఇంట్లో మరో షాక్..!.

లంచం కేసులో జైలులో ఉన్న తహసీల్దార్ ఇంట్లో మరో షాక్..!.

5 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించిన ఏసీబీ.

శామీర్‌పేట్ తహసీల్దార్ మరియు జాయింట్ సబ్-రిజిస్ట్రార్ తుమ్మకొమ్మ సుచరితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన తెలంగాణ ఏసీబీ.

సోదాల్లో సుమారు ₹5.05 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించినట్లు వెల్లడించారు. ఇందులో 3 ఫ్లాట్లు, 2 ప్లాట్లు, వ్యవసాయ భూమి, ₹12 లక్షల నగదు, ₹1.2 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు, ₹38 లక్షల బ్యాంకు డిపాజిట్లు, రెండు కార్లు ఉన్నట్లు సమాచారం.

అయితే ఈ ఆస్తుల మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే ₹30 లక్షల లంచం కేసులో న్యాయపరమైన కస్టడీలో ఉన్న సుచరితపై ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది.