నేటి పంచాంగం..ఏరువాక పూర్ణిమ..

ఓం శ్రీ గురుభ్యోనమః

*సోమవారం, జూన్ 29, 2026*

*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు*
*నిజ జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం*

తిథి : *పూర్ణిమ* తె4.25 వరకు
వారం : *సోమవారం* (ఇందువాసరే)
నక్షత్రం : *మూల* తె3.54 వరకు
యోగం : *శుక్లం* మ3.08 వరకు
కరణం : *భద్ర* మ3.26 వరకు
తదుపరి *బవ* తె4.25 వరకు

వర్జ్యం : *ఉ10.09 – 11.56*
మరల *రా2.08 – 3.54*
దుర్ముహూర్తము : *మ12.29 – 1.21*
మరల *మ3.05 – 3.57*
అమృతకాలం : *రా8.48 – 10.35*
రాహుకాలం : *ఉ7.30 – 9.00*
యమగండ/కేతుకాలం : *ఉ10.30 – 12.00*

సూర్యరాశి: మిథునం || చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం: 5.31 || సూర్యాస్తమయం: 6.34

ఏరువాక పూర్ణిమ.

ఇవాళ రైతన్నల పండుగ ఏరువాక నిర్వహించనున్నారు. నేడు జేష్ఠ పౌర్ణమి ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల పండుగ ఏరువాక ఉత్సవాలను నిర్వహించేందుకు సర్కార్ సిద్ధమైంది. గుంటూరు సమీపంలోని లాం వ్యవసాయ పరిశోధన కేంద్రం లో జరిగే వేడుకలలో మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎద్దులు, భూమిని పూజించి పొలంలో నాగలితో దున్ని వ్యవసాయ పనులను అన్నదాతలు ప్రారంభిస్తారు. ఖరీఫ్ లో ఎలినినో ప్రభావం, వేయాల్సిన పంటలపై రైతులకు అధికారులు అవగాహన కల్పించనున్నారు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజున నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి రోజుగా భావిస్తారు. అందుకే వర్షాకాలం ప్రారంభం కాగానే కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత బొబ్బట్లు వాటికి పెడతారు. పొలానికి వెళ్లి భూమాతకు ఆరాధిస్తారు. ఏరువాక పౌర్ణమి రోజున సాయంత్రం.. రంగురంగుల బట్టలతో ఎద్దులను అలంకరిస్తారు. అనంతరం ఎద్దులు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను నూనెలను తాగిస్తారు. ఇదే ఈ ఏరువాక ప్రత్యేకత..

పూజా కార్యక్రమాలు: వ్యవసాయానికి ఉపయోగపడే నాగలి, కాడెద్దులకు ప్రత్యేకంగా పూజలు చేసి, వాటికి ఎంతో ఇష్టమైన నైవేద్యం (బొబ్బట్లు) పెడతారు.భూమాత ఆరాధన: పొలానికి వెళ్లి భూమిని నమస్కరించుకుని, మంచి పంటలు పండాలని భూమాతను వేడుకుంటారు.ఎద్దుల అలంకరణ: సాయంత్రం వేళలో ఎద్దులను రంగురంగుల బట్టలు, గంటలు, పూలతో అందంగా అలంకరిస్తారు.ఆయుర్వేద రక్షణ: ఎద్దులు వర్షాకాలంలో ఎలాంటి అంటువ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు.. వాటికి ప్రత్యేక ఆయుర్వేద మందులు, నూనెలను తినిపించి, తాగిస్తారు.

*సర్వేజనాస్సుఖినో భవంతు! – శుభమస్తు*