ఐర్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు ఊహించని ఘోర పరాభవం..ప‌సికూన ఐర్లాండ్ చేతిలో టీమ్ఇండియా 34 ప‌రుగుల తేడాతో ఓటమి..!

IND vs IRE 2nd T20: టాప్ ఆర్డర్ అట్టర్ ఫ్లాప్.. పరుగు తేడాతో ఓడిన టీమిండియా.. సిరీస్ పాయె!..

ఐర్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు ఊహించని ఘోర పరాభవం ఎదురైంది. టీ20 ప్రపంచకప్‌-2026 ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు.. ఐర్లాండ్ గడ్డపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలై సిరీస్‌ను 0-2తో పూర్తిగా చేజార్చుకుంది. బెల్‌ఫాస్ట్‌లోని స్టార్మాంట్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన రెండో టీ20 మ్యాచ్‌లోనూ ఐర్లాండ్ జట్టు 1 పరుగు తేడాతో భారత్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది..ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్(IND vs IRE) తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అనంతరం 155 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేవలం ఒక్క పరుగు తేడాతో విజయాన్ని ముద్దాడిన ఐర్లాండ్ చారిత్రాత్మక రీతిలో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ప్రపంచ ఛాంపియన్ హోదాలో ఉన్న భారత జట్టు, పసికూనగా భావించే ఐర్లాండ్ చేతిలో ఇలా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. భారత బ్యాటింగ్ వైఫల్యంతో పాటు, చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఐరిష్ బౌలర్లు అద్భుతంగా రాణించి భారత్‌ను కట్టడి చేశారు. ఈ ఓటమితో టీమిండియా పర్యటన తీవ్ర పరాజయంతో ముగిసింది..
మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మిపై టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ స్పందించాడు. బ్యాటింగ్ కంటే బౌల‌ర్ల వైఫ‌ల్య‌మే త‌మ కొంప‌ముంచింద‌న్నాడు. మ్యాచ్ ప్రారంభంలో బౌల‌ర్లు అద్భుతంగా బంతులు వేశార‌న్నాడు. పిచ్ నుంచి మంచి స్వింగ్ ల‌భించడంతో కొన్ని వికెట్లు ప‌డ‌గొట్ట‌డంతో అద్భుత‌మైన ఆరంభం ల‌భించింద‌న్నాడు. అయితే.. మిడిల్ ఓవ‌ర్ల‌లో త‌మ ప్ర‌ణాళిక‌ల‌ను స‌రిగ్గా అమ‌లు చేయ‌లేక‌పోయామ‌న్నాడు.

మైదానం చాలా చిన్న‌ది అని తెలిసిన‌ప్ప‌టికి కూడా స్ట్రైయిట్ షాట్లు ఆడేలా బంతులు వేశామ‌న్నాడు. ప్ర‌త్య‌ర్థిని 140 ప‌రుగుల లోపు క‌ట్ట‌డి చేసి ఉంటే బాగుండేద‌న్నాడు. ఫ‌లితం ఎలా ఉన్న‌ప్ప‌టికి కూడా ఇలాంటి వేదిక‌ల్లో ఆడ‌డం బాగుంద‌న్నాడు. ఇక్క‌డి వాతావ‌ర‌ణం, పిచ్‌ల‌పై త‌మ‌కు ఇప్పుడు ఓ స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న వ‌చ్చింద‌న్నాడు. సుదీర్ఘ విరామం త‌రువాత ఆడ‌డం కూడా ఓట‌మికి ఓ కార‌ణం అని చెప్పాడు.

ఇక ఈ మ్యాచ్ ఫ‌లితాన్ని వీలైనంత త్వ‌ర‌గా మ‌రిచిపోయి త‌దుప‌రి మ్యాచ్ కోసం స‌న్న‌ద్ధం అవుతామ‌న్నాడు. ఈ మ్యాచ్ ఓట‌మి నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంద‌న్నాడు.’ ఏ విషయాన్నీ తేలికగా తీసుకోకూడదు . కేవలం మైదానంలో అడుగుపెట్టినంత మాత్రాన మ్యాచ్‌లు గెలవలేము. కష్టపడి ఆడాలి. ఆట‌పైనే దృష్టి పెట్టాలి. ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేయాలి. ప్ర‌త్య‌ర్థి పై ఒత్తిడి పెంచే అవ‌కాశం దొరికితే దాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి. త‌దుప‌రి మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాము.’ అని శ్రేయ‌స్ అయ్య‌ర్ తెలిపాడు.

భారత్ vs ఐర్లాండ్ లైవ్ స్కోర్: జై మూంద్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు
రాజస్థాన్‌లో జన్మించిన ఐర్లాండ్ ఆటగాడు జై మూంద్రా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మరియు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గా నిలిచాడు..