బీఆర్ఎస్ పార్టీ గూండాగిరికి కాంగ్రెస్ ప్రభుత్వం భ‌‌‌‌య‌‌‌‌ప‌‌‌‌డేది లేదు.. మంత్రి పొన్నం.

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గూండాగిరికి కాంగ్రెస్ ప్రభుత్వం భ‌‌‌‌య‌‌‌‌ప‌‌‌‌డేది లేద‌‌‌‌ని రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. గత పదేండ్ల పాలనలో కోట్ల రుపాయలు దోచుకున్న ఆ పార్టీ నేతలు ఇంకా అధికారంలో ఉన్నామని.. మ‌‌‌‌ళ్లీ అధికారంలోకి వ‌‌‌‌స్తామ‌‌‌‌నే భ్రమ‌‌‌‌తో మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గురువారం గోషామహల్, మలక్ పేట నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గ‌‌‌‌త ప‌‌‌‌దేండ్లలో బీఆర్ఎస్ నేతలు అంటించుకున్న బుర‌‌‌‌ద‌‌‌‌ను ఇప్పటి ప్రభుత్వానికి లేదా మంత్రుల‌‌‌‌కు అంటించాల‌‌‌‌ని చూస్తున్నారు. .
కోట్లాది రూపాయిలు కొల్ల‌గొట్టిన బీఆర్ఎస్ నాయ‌కులు ఇంకా అధికారంలోనే ఉన్నాం లేదా మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌నే భ్ర‌మ‌తో మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. వారి అవినీతిని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా బ‌య‌ట‌పెట్టారన్నారు. అయినా ఇంకా అధికారంలోకి వ‌స్తామ‌ని ప‌గ‌టి క‌ల‌లు కంటూ ఈ ప్ర‌భుత్వంపై గుడ్డ‌కాల్చి వేసిన‌ట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

‘గ‌త ప‌దేళ్ల‌లో వారు అంటించుకున్న‌ బుర‌ద‌ను ఇప్ప‌టి ప్ర‌భుత్వానికి లేదా మంత్రుల‌కు అంటించాల‌ని చూస్తున్నారు. ఐదేళ్ల పాల‌న‌కు ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు అధికార‌మిస్తే మ‌తి భ్ర‌మించి రెండున్న‌రేళ్ల‌కే గ‌ద్దె దిగ‌మ‌ని డిమాండ్ చేయ‌డం హాస్యాస్ప‌దం. ఈ రెండున్న‌ర సంవ‌త్స‌రాల‌్లో ఏం జ‌రిగిందో ఎలాంటి తీర్పులు వ‌చ్చాయో రాష్టప్ర‌జ‌ల‌కు, దేశానికి తెలుసు. ఏశాఖ అయినా స‌రే పిలిచిన టెండ‌ర్ మొత్తం కంటే మూడు నాలుగు రెట్లు అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించ‌డం వారి అవివేకానికి నిద‌ర్శ‌నం. ఇలాగే వారి ప్ర‌వ‌ర్త‌న కొన‌సాగితే రానున్న కాలంలో వారికి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌దు.’- మంత్రి పొంగులేటి

బీఆర్‌ఎస్‌ స‌వాల్‌ను స్వీక‌రించి మా మంత్రులు వ‌స్తే మీరు రాకుండా ప‌రార‌య్యారని పొంగులేటి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ మంత్రులు అక్క‌డే గంట వ‌ర‌కూ వేచి చూసి మీడియాతో మాట్లాడి వ‌చ్చారని చెప్పారు. అసెంబ్లీలో కూడా మీరు ఏం మాట్లాడ‌తారో మాకు తెలుసంటూ.. దానికి కూడా తేదీని ఖ‌రారు చేస్తామని స్పష్టం చేశారు..