టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే..
కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేనపై ఎన్నికల సంఘం ఆదేశాలు..
15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకపోతే ఎలాంటి తదుపరి సమాచారం లేకుండా పార్టీ దరఖాస్తును మూసివేస్తామని సీఈసీ వెల్లడి..
టీఆర్ఎస్ పేరుపై ప్రజల్లో అనేక అభ్యంతరాలు వ్యక్తం అయినందున, ఆ పేరు కొనసాగించడం కుదరదని కవితకు లేఖ రాసిన సీఈసీ..
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పురుడుపోసుకున్న ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీకి ఈసీ ఊహించని షాక్ ఇచ్చింది. కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన నూతన రాజకీయ పార్టీ పేరు పై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమె కొత్తగా పెట్టబోయే పార్టీకి ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) గా నామకరణం చేస్తూ రిజిస్ట్రేషన్ కోసం ఈసీకి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పేరును మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) కవితకు అధికారికంగా లేఖ రాశారు. రాబోయే 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను తమకు సమర్పించక పోతే, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును పూర్తిగా మూసివేస్తామని ఈసీ గడువు విధించినట్లు తెలుస్తోంది….