అల్పపీడనం అంతకంతకూ బలపడుతోంది… దీంతో ఇది తుపానుగా ఏమైనా మారుతుందా అనే అనుమానం వాాతావరణ నిపుణుల్లో నెలకొంది. ఒకవేళ తుపానుగా మారితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో వర్షబీభత్సం.
..Heavy Rain Alert.
ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ అల్పపీడనం ఒకటి రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇదే పరిస్థితులు కొనసాగితే అల్పపీడనం కాస్త వాయుగుండం, తుపానుగా మారే అవకాశాలు లేకపోలేదు.
ఒకవేళ తుపాను ఏర్పడితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలం తప్పదు… ఆంధ్ర ప్రదేశ్ తీరంవైపు దూసుకువచ్చి కుండపోత వర్షాలను, బలమైన ఈదురుగాలులతో బీభత్సం సృష్టించవచ్చు. అయితే అల్పపీడనం తుపాను గా మారుతుందా లేదా అన్నదానిపై నాలుగైదు రోజుల్లో క్లారిటీ రానుంది..బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో జోరువానలు కురుస్తున్నాయి. ఇవాళ (జూలై 4, శనివారం) కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA)హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంద్ర జిల్లాలు అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం లలో కుండపోత వర్షాలు కురుస్తాయంటోంది. ఇక పోలవరం, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని APSDDMA హెచ్చరించింది…
ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాల తీవ్రత పెరిగింది. ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది… ఇది మరింత బలపడుతూ ముందుకు కదులుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ప్రస్తుతానికి అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో కొనసాగుతోందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్రలో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు…మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ఈ అల్పపీడనం బలపడి ఆంధ్ర ప్రదేశ్ తీరంవైపు వస్తే మాత్రం కుండపోత వర్షాలు తప్పవంటున్నారు. రానున్న 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని… సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించింది. తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచిస్తోంది..