యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు 14 రోజుల రిమాండ్..

YouTuber Ravan..
యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు 14 రోజుల రిమాండ్..

UAPA చట్టం కింద అతనిపై కేసు ఫైల్ చేసిన పోలీసులు..

రావణ్‌ను నెల్లూరు జైలుకి తరలించిన పోలీసులు..

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు గన్నవరం కోర్టులో చుక్కెదురైంది.. న్యాయమూర్తి రావణ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నెల 18వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధించగా.. భద్రతాపరమైన అంశాల కారణంగా కోర్టు ఆదేశాలతో రావణ్‌ను వెంటనే నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో గన్నవరం పోలీసులు అతడ్ని కస్టడీకి కోరే అవకాశం ఉంది. గన్నవరం పోలీసులు రావణ్‌పై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు..యూట్యూబర్ బచ్చలకూర జోసెఫ్‌ అలియాస్‌ ప్రశ్న రావణ్‌కు 14 రోజులు రిమాండ్ విధించారు. జనసేన పార్టీ నేత గరికపాటి శివశంకర్ ఫిర్యాదుపై కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్‌లో రావణ్‌పై కేసు నమోదైంది.. ఆయనపై విద్రోహం సహా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రావణ్‌ను అరెస్ట్ చేసి గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నించారు. అనంతరం గన్నవరం అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 18 వరకు రిమాండ్ విధించారు. వెంటనే రావణ్‌ను నెల్లూరు జైలుకు తరలించారు…రావణ్‌పై కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు దేశద్రోహం, ఉపా చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రావణ్‌పై బీఎన్‌ఎస్‌లోని 152 సహా పలు సెక్షన్లు, ఉపా సెక్షన్ల కింద అభియోగాలు ఉన్నాయి. రావణ్‌ను శనివారం అర్ధరాత్రిఅరెస్టు చేసి గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రావణ్‌పై 147, 148, 152, 192, 197(1)(డి), 353(1)(బి), ఉపా సెక్షన్‌ 13, ఉపా సెక్షన్‌ 39 కింద గన్నవరం పోలీసులు కేసు పెట్టారు. రావణ్ నిర్వహిస్తున్న ప్రశ్న యూట్యూబ్ ఛానల్‌లో సీపీఐ మావోయిస్టు సంస్థను పొగుడుతూ ఆ భావజాలాన్ని తీసుకెళ్లేలా, సాయుధ తిరుగుబాటుకు మద్దతు తెలిపారని ఆరోపించారు. ఆ దిశగా ప్రోత్సహిస్తూ ప్రసంగం చేస్తూ వీడియోను యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశారని జనసేన పార్టీ నేత శివశంకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు..