తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ.
తెలంగాణకు 7 రోజుల పాటు వర్ష సూచన
ఉత్తర తెలంగాణలో 60 కి.మీ.వేగంతో గాలులు వీచే అవకాశం.
రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.
ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఈ వర్షాలతో పాటు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఆదిలాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం సహా 12 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు..
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, మెదక్, జనగాం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల కారణంగా లోతట్టు రహదారులు జలమయం కావడం, దృశ్యమానత (విజిబిలిటీ) తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున, ప్రయాణాలు చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని గమనిస్తూ ఉండాలని వాతావరణ శాఖ కోరింది..