కడియం శ్రీహరికి అంత నిజాయితీ ఉంటే రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి చూపించాలి.. మంత్రి కొండా సురేఖ..
కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి ..
లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకో..
కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే రాజకీయాలకు రాజీనామా చేయాలి..
కడియం శ్రీహరి వచ్చాకే కాంగ్రెస్ పార్టీలో వివాదాలు మొదలయ్యాయి..
40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, సాధారణ ఎమ్మెల్యే పదవిలో ఉండలేకపోతున్నాడు..
ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతే, దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి లేకపోతే రాజకీయాలకు రాజీనామా చేసి ఇంట్లో పడుకోండి..
కడియం శ్రీహరికి అంత నిజాయితీ ఉంటే రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి చూపించాలి..
మహేష్ కుమార్ గౌడ్‌ను కలిశాను, 14వ తేదీన మీనాక్షి నటరాజన్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తాను అంటూ- మంత్రి కొండా సురేఖ తీవ్రస్థాయిలో విమర్శలు గుపించారు..
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని మంత్రి కొండా సురేఖ సవాల్ విసిరారు. గతంలో తాము కాంగ్రెస్ నుండి వైసీపీలోకి వెళ్లినప్పుడు, అలాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే టైంలో నాలుగేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ కొండా మురళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కడియం కూడా అదే బాటలో వెళ్లి తన నైతికతను చాటుకోవాలని డిమాండ్ చేశారు.
దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తనను కాదని, కడియం శ్రీహరి తన పరిధి దాటి అధికారులతో నేరుగా మాట్లాడటంపై కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ వివాదం మొదలైంది. జిల్లా రాజకీయాల్లో కడియం తనను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆమె ఈరోజు ఉదయమే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కూడా ఫిర్యాదు చేశారు.
కొద్దిరోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్న ఈ ఇద్దరు నేతల వ్యవహారం తాజా సవాల్‌తో మరింత హీటెక్కింది. ఇద్దరూ ఎవరూ తగ్గేదే లే అన్నట్లుగా డైలాగ్ వార్ నడుపుతుండటం పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు మంత్రి సురేఖ విసిరిన ఈ సవాల్‌పై కడియం శ్రీహరి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది..