చైనా వైపు మరో రక్కసి తుఫాను దూసుకొస్తోంది. తూర్పు తీరంవైపు బావి తుఫాను వస్తోందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాను తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న రీత్యా వాతావరణ శాఖ గురువారమే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం తుఫాను మొదట తైవాన్ను తాకి అనంతరం చైనాలోని ఫుజియన్, జెజియాంగ్ ప్రావిన్సుల్లో తీరాన్ని తాకనుంది. ప్రభావిత ప్రావిన్సుల్లో 40 సెంటీమీటర్ల వరకూ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు..రక్కసి తుఫాను దూసుకొస్తున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరానికి సమీపంలోని 17 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. 1.70 లక్షల మంది విపత్తు నిర్వహణ సిబ్బందిని సిద్ధంగా ఉంచింది. తీర ప్రాంతాలతో పాటూ బీజింగ్ వరకూ తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం మధ్యాహ్నమే రాజధాని బీజింగ్లో అధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. క్రీడాకార్యక్రమాలను వాయిదా వేశారు. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించారు. భారీ వర్షాలు, గాలులతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తైవాన్లో కూడా హైఅలర్ట్ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే విమాన సర్వీసులు నిలిచిపోయాయి. హాంకాంగ్ ఎయిర్లైన్స్ పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. గ్రేటర్ బే ఎయిర్లైన్స్ కూడా పలు విమాన సర్వీసులను నిలిపివేసింది. మిగిలిన విమానాలను దారి మళ్లించింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.